జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవ వేడుకలు

- Advertisement -

జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవ వేడుకలు

National Consumer Rights Day Celebrations

నరసరావుపేట,
: హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ నరసరావుపేట ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవ వేడుకలు స్థానిక మున్సిపల్ బంగ్లాలోని మీటింగ్ హాల్ నందు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య

అతిథిగా హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ మరియు ఫౌండర్ డాక్టర్ బొడ్డపాటి దాసు, నేషనల్ సెక్యూరిటీ డాక్టర్ శ్రీనిలత, స్టేట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తాళ్లూరి సత్యనారాయణ, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మహిళా డైరెక్టర్ పూనూరి

కృష్ణకుమారి, పల్నాడు జిల్లా ప్రెసిడెంట్ లాజర్, జిల్లా సెక్రెటరీ షేక్ మస్తాన్వలి, కమిటీ సభ్యులు శిరీష, లిల్లీ, నూర్జహాన్, దావూరి జ్యోతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, వినియోగదారుల హక్కుల

పరిరక్షణ 1986 లోనే చట్ట రూపు దాల్చిందన్నారు. ఆనాటి  భారత రాష్ట్రపతి వినియోగదారుల రక్షణ చట్టం 1986 పై సంతకం చేసిన  రోజుకి గుర్తుగా, ప్రతి సంవత్సరం డిసెంబర్ 24వ తేదీన జాతీయ వినియోగదారుల

దినోత్సవం గా జరుపుకుంటున్నామన్నారు. ప్రస్తుత సమాజంలో 5 రూపాయల వస్తువు నుంచి 5 లక్షల రూపాయల విలువైన వస్తు సేవల వరకు సంబంధించిన కేసులు వినియోగదారులు తాము నివసించే ప్రదేశంలోని

జిల్లా కమిషన్ లోనే ఫిర్యాదు చేయవచ్చు అన్నారు. 50 లక్షల విలువైన వస్తు సేవలకు సంబంధించిన కేసులు జిల్లా స్థాయిలో విచారిస్తారు అన్నారు. 50 లక్షల నుంచి 2 కోట్ల విలువ చేసే కేసులను రాష్ట్ర కమిషన్ లో

విచారిస్తారన్నారు. 2 కోట్ల విలువ కన్నా పైన ఉంటే జాతీయ వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించాలన్నారు. బాధితులు ఆన్లైన్లో కూడా ఫిర్యాదు చేసుకునేందుకు ఈ -దాఖిల్

(https://eaakhil.nic.in)అనే వెబ్సైట్ / యాప్ అందుబాటులో ఉందన్నారు. నేషనల్ కన్స్యూమర్ హెల్ప్లైన్  (NCH) మొబైల్ యాప్ లో కూడా బాధితులు ఫిర్యాదు చేయవచ్చు

అన్నారు. ఇందుకోసం 1915 లేదా 1800114000 టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేసి సమస్య చెబితే వారు జిల్లా స్థాయి కమిషన్కు తెలియజేస్తారని కమిటీ సభ్యులు వివరించారు. వినియోగదారుల చట్టం లోప భూయిష్ట

ఉత్పత్తులు, అసంతృప్తికరమైన సేవలో మరియు అనారోగ్యమైన వాణిజ్య పద్ధతుల నుండి వినియోగ దారులకు రక్షణ కల్పిస్తుందినీ విజిలెన్స్ కమిటీ మెంబర్ యజ్ఞ నారాయణ తెలియజేశారు. ఈ సమాజంలో చిన్నపిల్లల

నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరము వినియోగదారులమే  అని అన్నారు. ప్రతిరోజు మనం ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి వస్తువుల్ని లేదా సేవల్ని పొందుతున్నామని అన్నారు. కానీ కొన్ని సార్లు నష్టపోతూ

ఉంటామని తెలియజేశారు. ఆ విషయం ఎవరికీ చెప్పాలి, ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క వినియోగదారుడు బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సాధన కమిటీ

చైర్మన్ కాల్వ రవి, జన జాగృతి మండలి ప్రెసిడెంట్ పిడతల రమాదేవి పాల్గొన్నారు. ముఖ్యంగా వినియోగదారుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ నరసరావుపేట, మరియు రాఘవేంద్ర చారిటబుల్

ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular