రాయపూర్:నవంబర్ 07: సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా అభివర్ణిస్తున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ మంగళవారం నుంచి మొదలు కానుంది. తొలి విడతగా చత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లోని 20 అసెంబ్లీ స్థానాలతో పాటుగా మిజోరాంలోని 40 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం పోలింగ్ జరగనుంది. చత్తీస్‌గఢ్‌లో తొలి విడత ఎన్నికలు జరగనున్న 20 అసెంబ్లీ స్థానాల్లో 12 నియోజకవర్గాలు నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉండే బస్తర్ ప్రాంతంలోనే ఉన్నాయి. దీంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినఅధికారులు ఈ ప్రాంతంలోనే 60 వేల మంది భద్రతా సిబ్బందిని రంగంలోకి దించారు. వీరిలో 40 వేల మంది సిఆర్పిఎఫ్, 20 వేల మంది రాష్ట్ర పోలీసు లు ఉన్నారు. మావోయిస్టుల ఎన్నికల బహిష్కరణ పిలుపు, ప్రచారం సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా వారి కదలికలను గమనిస్తున్నారు. బస్తర్ ప్రాంతంలో మొత్తం 5304 పోలింగ్ కేంద్రాలుండగా వీటిలో 600 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. నిఘాను పటిష్టం చేసిన అధికారులు ఇక్కడ మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. భద్రతా కారణాల దృష్టా ఈ డివిజన్లోని అయిదు అ సెంబ్లీ నియోజకవర్గాల్లో 149 పోలింగ్ కేంద్రాలను పోలీసు స్టేషన్లలో ఏర్పాటు చేశారు. మరోవైపు 156 పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సిబ్బందితో పాటుగా ఇవిఎంలను హెలికాప్టర్ల ద్వారా తరలిస్తున్నారు. ఈ 20 నియోజకవర్గాల్లోను అధికార కాంగ్రెస్, బిజెపి మధ్య హోరాహోరీ పోటీ ఉంది. ఈ రెండు పార్టీలతో పాటుగా ఎస్పి, బిఎస్ పి, మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగీకి చెందిన పార్టీ కూడా బరిలో ఉండడంతో పోటీలు ఆసక్తికరంగా మారాయి. మొత్తం 223 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. బస్తర్‌లోని 12 నియోజకవర్గాల్లో 9 నియోజక వర్గాల్లో ఉదయం 7 గంటలనుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరగనుండగా, మిగతా మూడు స్థానాల్లో ఉదయం 8 గంటలనుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. కాగా మిగతా 70 స్థానాలకు ఈ నెల 17న జరిగే రెండో విడతలో పోలింగ్ జరగనుంది…
నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలకు నేడు ఎన్నికలు
Published By Voice Today Team
152
- Advertisement -
- Advertisement -
- Tags
- assembly election 2023
- assembly elections 2023
- election 2023
- mizoram
- mizoram assembly election
- mizoram assembly election 2023
- mizoram assembly elections
- mizoram election
- mizoram election 2023
- mizoram election 2023 date
- mizoram election 2023 opinion poll
- mizoram election live
- mizoram election news
- mizoram election results 2018
- mizoram election voting
- mizoram elections
- mizoram elections 2023
- mizoram elections 2023 live
- mizoram elections live
- mizoram news



