న్యూఢిల్లీ, అక్టోబరు 25, (వాయిస్ టుడే): నోయిడాలో 170, ఫరియాబాద్‌లో 179గా ఉంది. ఢిల్లీలోన కాకుండా మరి కొన్ని ప్రాంతాల్లోనూ వాయు నాణ్యత తగ్గిపోయింది. అహ్మదాబాద్‌లో 141,చెన్నైలో 126, లఖ్‌నవూలో 150,ముంబయిలో 163, పట్నాలో 142, పుణేలో 126, జైపూర్‌లో 134గా నమోదైనట్టు CPCB స్పష్టం చేసింది. సాధారణంగా AQI 0-50 మధ్యలో ఉంటే మెరుగ్గా ఉన్నట్టు పరిగణిస్తారు. 101-200 మధ్య ఉంటే “Moderate”గా, 201-300 మధ్య ఉంటే “Poor” అని, 301-400 మధ్య ఉంటే “Very Poor”, 401-500 మధ్య ఉంటే “Severe”గా పరిగణిస్తారు అధికారులు. ప్రస్తుత పరిస్థితులపై ఢిల్లీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చలికాలం ఇంకా పూర్తిగా మొదలు కాకముందే కాలుష్య స్థాయి తీవ్రంగా పెరిగిపోయిందని అంటున్నారు. ఉదయం 5 గంటల నుంచే పొగ మంచు కప్పేస్తోంది. కాసేపు కూడా బయట ఉండేందుకు వీల్లేకుండా పోతోంది. మార్నింగ్ వాక్‌కి వెళ్లే వాళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలుష్యాన్ని భరించలేక వెనక్కి మళ్లుతున్నారు. చాలా మంది శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటున్నారు. గత 24 గంటల్లో సగటు వాయు నాణ్యత 220గా నమోదైంది. అంతకు ముందు ఇది 263గా ఉంది. ఈ లెక్కల ఆధారంగా చూస్తే నాణ్యత కాస్త మెరుగైనప్పటికీ…ఇంకా ఆందోళనకరంగానే ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. దసరా వేడుకల్లో బాణసంచా కాల్చడమూ కాలుష్యాన్ని పెంచేసింది. ఈ క్రమంలోనే ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ కీలక విషయాలు వెల్లడించారు. ఢిల్లీలో 8 పొల్యూషన్ హాట్‌స్పాట్స్‌ని గుర్తించినట్టు చెప్పారు. ఇప్పటికే 13 హాట్‌స్పాట్‌లను గుర్తించిన ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా మరో 8 ఆ జాబితాలో చేర్చింది. గాల్లోని దుమ్ముని తగ్గించేందుకు ప్రత్యేక పౌడర్‌ని వినియోగించనుంది.
లాక్ డౌన్ దిశగా న్యూఢిల్లీ
Published By Voice Today Team
256
- Advertisement -
- Advertisement -
- Tags
- coronavirus lockdown
- covid-19 lockdown
- delhi
- delhi 1 week lockdown
- delhi during lockdown
- delhi g20 lockdown
- delhi in lockdown
- delhi lockdown
- delhi lockdown 4
- delhi lockdown ease
- delhi lockdown g20
- delhi lockdown news
- delhi lockdown news 2023
- delhi lockdown news today
- delhi lockdown rules
- delhi lockdown top news
- delhi new lockdown
- delhi one week lockdown
- g20 lockdown in delhi
- india lockdown
- lockdown
- lockdown in delhi
- lockdown new delhi
- new delhi
- weather



