- Advertisement -
నూతన మద్యం పాలసీ నోటిఫికేషన్ జారీ
New liquor policy notification issued
అమరావతి
ఏపీ నూతన మద్యం పాలసీ నోటిఫికేషన్ జారీ అయింది. ప్రభుత్వ మద్యం షాపుల విధానానికి స్వస్తి పలికారు. . ఈ నెల 12వ తేదీ నుండి ప్రైవేటు మద్యం షాపులు అందుబాటులోకి రానున్నాయి. మంగళశారం నుంచి ఈ నెల 9వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరిస్తారు. 11న 3,396 మద్యం షాపులకు లాటరీ నిర్వహిస్తారు. దరఖాస్తు రుసుము రూ. 2 లక్షలుగా న ప్రభుత్వం నిర్ణయించింది. రెండేళ్ల కాల పరిమితితో ఈ అక్టోబరు 12 నుంచి 2026 సెప్టెంబరు 30 వరకూ లైసెన్సులు జారీకి ఏర్పాట్లు అవుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 3,396 మద్యం దుకాణాలకు లైసెన్సులకు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ జరగనుంది. ప్రధాన నగరాల్లో 12 ప్రీమియం స్టోర్లు వుంటాయి. జనాభా ప్రాతిపదికన లైసెన్స్ వసూలు చేస్తారు. తొలి ఏడాది పది వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో 50 లక్షలు, ఐదు లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో 85 లక్షలుగా లైసెన్సు రుసుము వుంటుందిత. రెండో ఏడాది ఈ రుసుములపై పది శాతం చొప్పున పెంచి వసూలు చేస్తారు. ఏటా ఆరు విడతల్లో లైసెన్సు రుసుము చెల్లించాల్సి వుంటుంది. విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురాల్లో ప్రీమియం షాప్స్ ఏర్పాటు చేస్తారు. ఈ స్టోర్లకు ఐదేళ్ల కాలపరిమితి తో ఏడాదికి కోటి రూపాయల లైసెన్స్ ఫీజు వుంటుంది
- Advertisement -