Thursday, January 16, 2025

చైనాలో కొత్త వైరస్… తెలుగు రాష్ట్రాలు అలెర్ట్

- Advertisement -

చైనాలో కొత్త వైరస్… తెలుగు రాష్ట్రాలు అలెర్ట్

New virus in China... Telugu states on alert

హైదరాబాద్, జనవరి 6, (వాయిస్ టుడే)
చైనాలో పుట్టిన మరో కొత్త వైరస్‌ ప్రచంచాన్ని భయపెడుతోంది. ఇప్పటికే చైనాను గడగడలాడిస్తోంది. వైరస్‌తో ఇప్పటికే చైనాలో అనేక మంది ఆస్పత్రులపాలయ్యారు. మరణాలు కూడా సంభవిస్తున్నాయి. అయినా చైనా కనీసం విషయం బయటకు చెప్పడం లేదు. ఇప్పటికే 2019లో చైనాలోని వూహాన్‌ ల్యాబ్‌లో పుట్టిన కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచ దేశాలు తీడ్రంగా దెబ్బతిన్నాయి. ఆర్థికంగా నష్టపోయాయి. లక్షల మంది చనిపోయారు. కోట్ల మంది వైరస్‌ బారిన పడ్డారు. కొత్తగా పుట్టిన హ్యూమన్‌ మెటానిమో వైరస్‌ మరో కారోనాలా మాచే అకాశం ఉండడంతో ప్రపంచ దేశాలు అలర్ట్‌ అవుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా ఇప్పటికే కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది ప్రజలకు కీలక హెచ్చరిక జారీ చేసింది. హెచ్‌ఎంపీవీ ఒక సాధారణ శ్వాసకోశ వైరస్‌. ఇది శీతాకాలంలో జలుబు, ఫ్లూ వంటి లక్షణాలకు కలిగిస్తుంది. చిన్న పిల్లలు, వృద్దుల్లో వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
తెలంగాణలో కేసులు లేవు..
ఇదిలా ఉంటే.. తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 2024, డిసెంబర్‌లో శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల డేటాను విశ్లేషించగా, 2023తో పోలిస్తే గణనీయమైన పెరుగుదల కనిపించలేదుని పేర్కొంది. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లను నివారించేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ సూచించింది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
దగ్గుతున్నప్పుడు లేదా తుమ్ముతున్నప్పుడు నోటిని, ముక్కును రుమాలుతో లేదా టిష్యూతో మూసుకోవాలి.
సబ్బు లేదా ఆల్కాహాలిక్‌ ఆధారిత శానిటైజర్‌తో తరచూ చేతులు కడుక్కోవాలి.
గుంపులుగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలి.
జ్వరం, దగ్గు, తుమ్మలు వంటి లక్షణాలు ఉంటే.. బహిరంగ ప్రదేశాలకు వెళ్లడం నివారించాలి.
నీరు ఎక్కువగా తాగాలి. పోషకాహారం తీసుకోవాలి.
శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు తగ్గేందుకు గదులు బాగా గాలి పీల్చుకునేలా చూసుకోవాలి. అస్వస్థతకు గురైతే ఇంట్లోనే ఉండి ఇతరులను కలవొద్దు.
చేయకూడనివి..
చేతులు కలపడం..
టిష్యూ పేపర్‌ లేదా రుమాలును పునర్వినియోగం చేయడం.
అనారోగ్యంతో ఉన్న వ్యక్తులతో సన్నిహితంగా ఉండొద్దు.
కళ్లు, ముక్కు, నోటిని తరచూ తాకొద్దు.
బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మరాదు.
డాక్టర్‌ సూచనల మేరకు ఇన్‌ఫెక్షన్లకు మందులు వాడాలి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్