Saturday, February 8, 2025

వరుసగా 8వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలమ్మ

- Advertisement -

వరుసగా 8వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలమ్మ

Nirmalamma presented the budget for the 8th consecutive time

న్యూఢిల్లీ,
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ 2025  శనివారం నాడు పార్లమెంటులో ప్రవేశపెట్టారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వరసగా ఎనిమిదో సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టారు.
ఈ బడ్జెట్ లో సామాన్యుల నుంచి వ్యాపారుల వరకు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎలాంటి ప్రకటన వస్తుందని,ఎదురు చూస్తూ ఉండగా బడ్జెట్ ను నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టారు.
క్లీన్‍టెక్ మిషన్ కింద సోలార్, ఈవీ, బ్యాటరీ పరిశ్రమలకు ప్రోత్సాహం
పరిశ్రమలకు ప్రోత్సాహం కోసం నేషనల్ మానుఫ్యాక్చరింగ్ మిషన్
30 వేల పరిమితితో పట్టణ పేదల కోసం యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డులు..
వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 75 వేల కొత్త మెడికల్ సీట్లు
దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్లు
సంస్కరణలకు ప్రోత్సాహంగా రాష్ట్రాలకు 5 ఏళ్ల వ్యవధితో వడ్డీ లేని రుణాలు.
జల్ జీవన్ మిషన్ కింద 15 కోట్ల మందికి రక్షిత మంచినీరు అందించాం
ప్రతి ఇంటికీ రక్షిత మంచినీరు అందించేందుకు మరిన్ని నిధులు.
రాష్ట్రాలు, యూటీలతో ఒప్పందం ద్వారా 100 శాతం మంచినీటి కుళాయిలు
పీఎం ఆరోగ్య యోజన కింద గిగ్ వర్కర్ల కోసం హెల్త్ కార్డులు
8 కోట్ల మంది చిన్నారులు, కోటి మంది బాలింతల కోసం అంగన్వాడీ 2.0
దేశవ్యాప్తంగా 50 వేల పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్‍ల ఏర్పాటు.
పప్పు ధాన్యాల ఉత్పత్తికి స్వయం సమృద్ధి పథకం
బిహార్‌లో మఖానా బోర్డు ఏర్పాటు
కంది, మినుములు, మసూర్‌లను కొనుగోలు చేయనున్న కేంద్రం
పండ్లు, కూరగాయల ఉత్పత్తికి నూతన పథకం
కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల పరిమితి పెంపు 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంపు. ఇది 7.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం.
ప్రధాన మంత్రి ధన్‌ ధాన్య యోజన కార్యక్రమాన్ని ప్రకటించిన కేంద్ర మంత్రి
దేశంలో వెనుకబడిన జిల్లాలో వ్యవసాయానికి ప్రోత్సాహం
గోదాములు, నీటిపారుదల, రుణ సౌకర్యాల కల్పన. ఇది 1.7 కోట్ల గ్రామీణ రైతులకు లబ్ధి.
ఎంఎస్‌ఎం ఈలకిచ్చే రుణాలు 5 కోట్ల నుంచి 10 కోట్లకు పెంపు.
స్టార్టప్‌లకు 10 కోట్ల నుంచి 20 కోట్లకు పెంపు
బొమ్మల తయారీకి ప్రత్యేక పథకం.
అధికోత్పత్తి వంగడాల కోసం ప్రత్యేక జాతీయ మిషన్‌
2024 జులై నుంచి వందకుపైగా అధికోత్పత్తి వంగడాలు విడుదల
పత్తి ఉత్పాదకత పెంచేందుకు జాతీయ స్థాయిలో ప్రత్యేక మిషన్‌, పత్తి రైతులకు మేలు చేసేలా దీర్ఘకాలిక లక్ష్యాలతో జాతీయ పత్తి మిషన్‌
రాష్ట్రాలకు 1.5 లక్షల కోట్లు కోట్ల రుణాలు
50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు.
సంస్కరణల అమలు చేస్తే ప్రోత్సాహకాలు
గిగ్‌ వర్కర్లకు గుర్తింపు కార్డులు
ఈ-శ్రమ్‌ పోర్టల్‌ కింద నమోదు
కోటి మంది గిగ్‌ వర్కర్లకు పీఎం జన్‌ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా కల్పన.
ఎగుమతుల్లో 45 శాతం వరకు ఎంఎస్‌ఎంఈల భాగస్వామ్యం
ఎంఎస్‌ఎంఈలకు వచ్చే ఐదేళ్లలో 1.5 లక్షల కోట్లు
27 రంగాల్లో స్టార్టప్‌లకు రుణాల కోసం ప్రత్యేక కార్యాచరణ.
నమోదు చేసుకున్న సూక్ష్మ సంస్థలకు 5 లక్షలతో క్రెడిట్ కార్డు
సూక్ష్మ సంస్థలకు తొలి ఏడాది 10 లక్షల వరకు క్రెడిట్ కార్డులు
ఎంఎస్‌ఎంఈలకు 10 వేల కోట్లతో ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ ఏర్పాటు.
బిఎన్ ఎస్ స్పూర్తితో కొత్త ఇన్‌కమ్‌ ట్యాక్స్ బిల్లు తీసుకొస్తాం.
లిటిగేషన్లను తగ్గించేలా ఇన్‌కమ్‌ ట్యాక్స్ విధానం
మిడిల్ క్లాస్ ప్రజలను దృష్టిలో ఉంచుకుని వ్యక్తిగత పన్ను విధానం
సీనియర్ సిటిజన్లకు టీడీఎస్, మినహాయింపు 50వేల నుంచి 1లక్షకు పెంపు
అప్‌డేటెడ్ ఇన్‌కమ్‌ ట్యాక్స్ నమోదుకు నాలుగేళ్లు పొడిగింపు.
ఇన్సూరెన్స్ రంగంలో వందశాతం ఎఫ్ డి ఐ లకు అనుమతులు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్