Thursday, December 12, 2024

మండలిలో గుత్తాపై అవిశ్వాస తీర్మానం…?

- Advertisement -

మండలిలో గుత్తాపై అవిశ్వాస తీర్మానం…?
హైదరాబాద్, జూన్ 18,
అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మరో పొలిటికల్ ఫైట్‌కు తెలంగాణ శాసన మండలి వేదికకానుందా? చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు బీఆర్ఎస్ అధిష్టానం రెడీ అవుతోందా? అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పోల్చితే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగలడంతో మండలిలో గుత్తాపై అవిశ్వాస తీర్మానం వైపు బీఆర్ఎస్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అధికార కాంగ్రెస్‌తో సన్నిహితంగా ఉంటున్న శాసన మండలి చైర్మన్ గుత్తాకు వ్యతిరేకంగా అవిశ్వాసం నెగ్గితే రాజకీయంగా పైచేయి చాటుకోవచ్చని బీఆర్ఎస్ అధిష్టానం ఉవ్విళ్లూరుతున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో శాసన మండలిలో తమ బలాన్ని పెంచుకునేందుకు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కు సన్నద్ధమవుతోందన్న టాక్ వినిపిస్తోంది. మొత్తానికి మండలి ఛైర్మన్ గుతాపై బీఆర్ఎస్ పెట్టనున్న అవిశ్వాస తీర్మానం, దీన్ని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ అనుసరించనున్న వ్యూహాలు.. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి..శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పై బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారన్న వార్తలు రావడంతో కాంగ్రెస్ నాయకత్వం అప్రమత్తమైంది. మండలి చైర్మన్ పై బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం పెడితే ఆ పార్టీకి ఉన్న సంఖ్యా బలంతో తేలికగా నెగ్గుతుంది. సభలో బీఆర్ఎస్ ఆధిపత్యాన్ని గండి కొట్టేందుకు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష వైపు మొగ్గు చూపుతోంది. బీఆర్ఎస్ నుంచి 14 మంది ఎమ్మెల్సీలను చేర్చుకుంటే మండలిలో కాంగ్రెస్ సంఖ్యాబలం 20కి చేరుకుంటుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. మొత్తం మీద మండలి చైర్మన్ గుత్తాపై పెట్టానున్న అవిశ్వాస తీర్మాన రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అవిశ్వాస తీర్మానాలతో అన్నింటిని కైవసం చేసుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికలు విజయ దుందిభీ మోగించిన కాంగ్రెస్.. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఆశించిన పెర్ఫామెన్స్ ప్రదర్శించ లేకపోయింది. మరోవైపు బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాకుండా కాంగ్రెస్ ఖంగు తినిపించింది. శాసనసభలో బలం లేకపోయినా.. పెద్దల సభ శాసనమండలిలో ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని బిఆర్ఎస్ భావిస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్, బిజెపిల వైపు గోడ దూకేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్‌తో సన్నిహితంగా ఉండడం, పార్లమెంట్ ఎన్నికల టైంలో సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్ రెడ్డి కాంగ్రెస్ చేరడాన్ని బీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతోంది.ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలవేళ బీఆర్ఎస్‌లోని గుత్తా అనుచరులు మొత్తం గంపగుత్తగా కాంగ్రెస్ చేరారు. తొలుత అమిత్ రెడ్డి నల్గొండ, భువనగిరి నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఆశించగా.. ఉమ్మడి జిల్లాకు చెందిన పార్టీ మాజీ ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ పెద్దలకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సుఖేందర్ రెడ్డి.. కేసీఆర్, బీఆర్ఎస్‌పై ఫైర్ అయ్యారు. కేసిఆర్ చెప్పుడు మాటలు వినడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యామని ఎంపీ ఎన్నికల సమయంలో గుత్తా సుఖేందర్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఈ పరిణామాల నేపథ్యంలో సుఖేందర్ రెడ్డిని చైర్మన్ పదవి నుంచి దింపాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌లో నెగ్గడం ద్వారా అధికార కాంగ్రెస్‌ను ఇరకాటంలో పడేయవచ్చునే చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతోందట. గుత్తాపై అవిశ్వాస తీర్మానంలో నెగ్గితే ఓ రకంగా రేవంత్ రెడ్డి దూకుడుకు చెక్ పెట్టినట్టేనని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి..తెలంగాణ శాసన మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 40 కాగా, ప్రస్తుతం రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ రెండు మినహాయిస్తే ప్రస్తుతం మండలిలో 38 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. మండలి చైర్మన్ పదవి నుంచి దింపడానికి మొత్తం సభ్యుల్లో 2/3 వంతు మెజార్టీ ఉండాలి. ప్రస్తుతం 27 మంది సభ్యులు అవిశ్వాసానానికి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పక్షాన 31 మంది ఎమ్మెల్సీలు ఉన్నట్టు మండలి రికార్డులు చెప్తున్నాయి. కానీ దామోదర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీగా గెలిచారు. చైర్మన్ సుఖేందర్ రెడ్డితో కలిపితే కాంగ్రెస్ సంఖ్య ఆరుకు పెరిగింది. వీరిని మినహాయిస్తే బీఆర్ఎస్ తరఫున 26 మంది ఉంటారు. ఎంఐఎంకు ఇద్దరు ఎమ్మెల్సీలు ఉండగా, బీజేపీ కి ఒకరు ఉన్నారు. టీచర్ ఎమ్మెల్సీలు ఇద్దరు ఓటింగ్ కు దూరంగా ఉండే అవకాశం ఉంది.ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి శాసనసభలో తిరుగులేని బలం ఉన్నా.. మండలిలో మాత్రం బీఆర్ఎస్ పార్టీదే పైచేయిగా ఉంది. పలు కీలక బిల్లుల ఆమోదం, ఇతర అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి అడ్డంకిగా మారే పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శాసనమండలిలో ‘ఆపరేషన్ ఆకర్ష కు సిద్ధమవుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. రాష్ట్రం ఏర్పడినపుడు శాసనసభలో బీఆర్ఎస్ కు తిరుగులేని బలం ఉన్నా.. శాసన మండలిలో మాత్రం కాంగ్రెస్‌దే ఆధిపత్యం ఉండేది. అప్పట్లో.. అధికార బీఆర్ఎస్… మండలిలోని మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకుంది

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్