ఆత్మహత్యలు వద్దు
జీవితం చాలా చిన్నది విలువైనది. కాని వచ్చే సమస్యను మనిషి ఎందుకు పెద్దదిగా చూస్తున్నారు. జీవితం అంటే పోరాటం. ఈ సృష్టిలో ఉన్న సకల జీవరాశుల లో మనిషికి మాత్రమే బుద్ది ఇవ్వబడింది. అలాంటి బుద్ది ఉన్న మనిషి కష్ట సుఖాలను ఒకే రీతిలో అనుభవించడం లేదు.
జీవితం విలువ తెలుసా!
జీవితం విలువ తెలియాలంటే అనాధాశ్రమలను సందర్శించండి. తనను విడిచి పెట్టి వదిలేసి వెళ్లిపోయిన కొడుకు కోసం తపన చెందే ముసలి తల్లిని అడగండి. ఏదో ఒక రోజు వచ్చి తప్పు తెలుసుకొని తనను తీసుకువెళ్తాడు అనే ఒకే ఒక్క ఆశతో ఎదురు చూసే ఆమె చెపుతుంది.
క్యాన్సర్ హాస్పిటల్ వెళ్లి చావుతో పోరాడుతున్న యుక్త వయస్సు గల వ్యక్తిని అడగండి జీవితం విలువ ఏంటో తెలియజెప్తాడు. ఇంకో మూడు నెలలు బ్రతకనిస్తే చాలు తనకున్న అనుబంధాలతో వారి ప్రేమను పంచుకొని తీరలేని చిన్న కోరికలను తీర్చుకుని జీవితం యొక్క మాధుర్యాన్ని తనివితీరా అనుభవిస్తే చాలు అంటాడు.
అలాంటి విలువైన జీవితాన్ని మరిచి మనిషి ప్రాణాలు నేడు వివిధ కారణాలతో గాల్లో కలుస్తున్నాయి.
2023 WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం
ప్రతి సంవత్సరము 700000 కంటే ఎక్కువ మంది తమ ప్రాణాలను తీసుకుంటున్నారు.ఇందులో 15 నుండి 29ఏళ్ళ వయస్సు వారు చనిపోవడం గమనార్హం
ప్రతి ప్రాణ నష్టం కుటుంబాలు మరియు మొత్తం సమాజం పై తీవ్ర ప్రభావాలను చూపుతుందని తెలిపింది.
ఆత్మ హత్య అనే ఆలోచనలని నిరోధించడం
సమస్యలు కష్టాలు మనొక్కరికే లేవు మనలాంటి చాలా మంది ఉన్నారని గుర్తుంచుకోండి. దీని వల్ల మనం బయటపడొచ్చు.
ఆత్మ హత్య అనే ఆలోచన వచ్చినప్పుడు మనలో ఉంచుకోకూడదు. మనం ఎక్కువగా అర్థం చేసుకొనే వ్యక్తితో మనం అనుభవిస్తున్న ఎలాంటి విషయమైనా చెప్పుకోవాలి. సమస్యలు ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు పాజిటివ్ గా ఉండాలి. ఎంత పెద్ద సమస్య అయిన ఓపిక తో పరిష్కారం పై దృష్టి పెట్టాలి.
డ్రగ్స్ ఆల్కహాలు కి దూరంగా ఉండాలి ఎందుకంటే ఇవి ఆత్మ హత్య ఆలోచనను తీవ్రతను పెంచుతాయి.
ఎప్పుడు మనకి మనకి స్ఫూర్తి ఇచ్చే వ్యక్తుల చుట్టూ ఉండటం మంచిది. కుటుంబ సభ్యులు స్నేహితులు గడపడం సంభాషించడం ముఖ్యం
ఇతరులతో పోల్చుకోకండి. ఎందుకనగా ఒక్కొక్కరి జీవితం ఒక్కో విధంగా ఉంటుంది కాబట్టి. అంటే వారి అభిరుచులు జీవన విధానం, కుటుంబ పరిస్థితులు ఆలోచనలు, లక్ష్యాలు భిన్నంగా ఉండొచ్చు.
వాడుతున్న విద్యా కుసుమాలు
నేడు ఆత్మహత్యలు ఒక సామాజిక సమస్యగా మారుతున్నాయి. అందులో 95 శాతంమంది మానసిక ఒత్తిడి సమస్యలతో బాధపడుతున్నారు.
2023 NCRB రిపోర్ట్ ప్రకారం.. దేశ వ్యాప్తంగా 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న 1000మంది విద్యార్థులు ఆత్మహత్యలతో మరణించారు. దీనిలో 1000మంది కి పైగా విద్యార్థులు పరీక్షల్లో వైఫల్యమే కారణం అని తెలిపింది.
*ప్రభుత్వం ఉపాధ్యాయులు తల్లిదండ్రుల బాధ్యత *
పిల్లల కు విద్య విషయం లో వారి ఇష్టాలను అభిరుచులను తెలుసుకొని వారికి నచ్చిన రంగంలో రాణించే విధంగా ప్రోత్సహించాలి.
విద్యార్థుల ఎదుగుదల లో కుటుంబము, ఉపాధ్యాయులు చుట్టూ ఉన్న పరిసరాల వ్యక్తుల పాత్ర కూడ ఇమిడి ఉందని తెలుసుకోవాలి.
విద్యార్తులను ముఖ్యంగా ఇతరులతో పోల్చడం అనేది మానసికంగా నిరాశా నిస్పృహకు గురి చేసి ఆత్మన్యూనతా భావాన్ని దెబ్బతీస్తుందినీ గమనించాలి.
మార్కులే కొలమానంగా చదవకుండా మానసికంగా మేదోపరమైన సామర్థ్యాలు పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవాలి.
పాఠశాల నుంచి ఉన్నత విద్యాసంస్థలు వరకు సంభవించే విద్యార్థుల ఆత్మహత్యల నివారణపై ప్రభుత్వం దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది అత్మహత్యలపై అపోహలు తొలగించే విధంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తే బాగుంటుంది.