భూమి సాగును అడ్డుకుంటున్న వ్యక్తులకు నోటీసులు
Notices to persons obstructing land cultivation
బైండొవర్ చేసేందుకు చర్యలు
గుట్రాజ్ పల్లె రైతు గంగయ్యకు తహసీల్దార్ హామీ
జిల్లా ఎస్పీ ఆదేశాలతో బాధితుడికి రెవెన్యూ అధికారుల బాసట
జగిత్యాల,
దళిత రైతు గత కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూమిని కొందరు వ్యక్తులు అడ్డుకుంటూన్నారని బాధితుడు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కు పిర్యాదు చేయడంతో రెవెన్యూ అధికారులు ఆయనకు బాసటగా నిలిచిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది.నా భూమిలో
నాటువేయకుండా చేస్తున్నారని నేను మొఖాపైకి వెళ్లేలా చూడాలని జగిత్యాల రూరల్ మండలం గూట్రాజ్ పల్లె గ్రామానికి చెందిన దళిత రైతు కల్లేపల్లి గంగయ్య జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ను సోమవారం వేడుకున్నారు.
స్పందించిన ఎస్పీ జగిత్యాల రూరల్ తహసీల్దార్ కు ఫోన్ చేసి గంగయ్య సమస్యను పరిష్కరించాలని అదేశించారని గంగయ్య విలేకరులకు తెలిపారు.సోమవారం ప్రజావాణిలో సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతూ గంగయ్య అదనపు కలెక్టర్ బి ఎస్ లత కు వినతిపత్రం ఇవ్వగా జిల్లా ఎస్పీని కలవాలని ఆమె సూచించడంతో ఎస్పీని కలిసి విన్నవించగా తహసీల్దార్ కు ఫోన్ చేయడంతో గంగయ్య రూరల్ తహసీల్దార్ ను కలిసి జరిగిన సంఘటన వివరించగా అడ్డుకుంటున్న వ్యక్తులకు 3 రోజుల్లో నోటీసులు ఇస్తామని చెప్పారని గంగయ్య వివరించారు.
కల్లేపల్లి గంగయ్య తెలిపిన వివరాల ప్రకారం… గూట్రాజ్ పల్లి గ్రామంలో
439/12 సర్వేనంబర్ లో 19 గుంటల పట్టభూమి ఉండగా దానికి అనుకుని ఉన్న కొంత భూమిని తహసీల్దార్ సూచించిన మ్యాప్ ప్రకారం చదును చేసుకుని గత కొన్నేళ్లుగా సాగుచేసుకుంటుoటే మా గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కల్లేపల్లి లచ్చయ్య, గంగాధర్, గంగవ్వ, గౌరవ్వలు అడ్డు వస్తున్నారని
వారికి మా గ్రామానికి చెందిన మాజీ ప్రజాప్రతినిది సహకరిస్తు ఇబ్బందులకు గురి చేస్తుండడంతో నేను పొలం నాటువేసుకోలేదని తెలిపారు.
అడ్డుకుంటున్న విషయమై జగిత్యాల రూరల్ పోలీసు స్టేషన్లో పిర్యాదు చేసిన ఆ నాయకుడి ప్రోధ్భలంతో ఎవరిని దున్నకుండా చేస్తున్నాడని పోలీసులకు పిర్యాదు చేస్తే వారిపై కేసులు నమోదు చేసినప్పటికీ నన్ను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు.అట్టి భూమిపై ఆధారపడి మా కుటుంబం జీవనం సాగిస్తున్నామని, భూమిని సాగుచేసుకునేలా చూడాలని జిల్లా ఎస్పీ సూచనల మేరకు గంగయ్య జగిత్యాల రూరల్ తహసీల్దార్ ను సోమవారం కలిసి సమస్య విన్నవించగా అట్టి వ్యక్తులకు నోటీసులు పంపించి బైండొవర్ చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని గంగయ్య తెలిపారు.