Saturday, February 8, 2025

31 నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

- Advertisement -

31 నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

Budget Sessions of Parliament from 31st

న్యూఢిల్లీ జనవరి 28
: 31 నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ముందుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి ప్రసంగంపై చర్చను లోక్‌సభ, రాజ్యసభ సోమవారం (ఫిబ్రవరి 3న) చేపట్టనున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం సాధారణ బడ్జెట్‌ను ప్రతిపాదిస్తారు. రాష్ట్రపతి ప్రసంగం తరువాత కొద్ది సేపటికి శుక్రవారం లోక్‌సభ, రాజ్యసభ తిరిగి సమావేశం అయినప్పుడు ఆర్థిక శాఖ మంత్రి ఆర్థిక సర్వేను సమర్పిస్తారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు లోక్‌సభ తాత్కాలికంగా రెండు రోజులు (3, 4 తేదీలను) కేటాయించింది. ఆ చర్చకు రాజ్యసభ మూడు రోజులు కేటాయించింది.ప్రధాని నరేంద్ర మోడీ 6న రాజ్యసభలో ఆ చర్చకు సమాధానం ఇస్తారు. బడ్జెట్ సమావేశాలు సాఫీగా సాగేలా చూసేందుకు పార్లమెంట్‌లోని రాజకీయ పార్టీల సభా నాయకుల సమావేశాన్ని గురువారం (30న) పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఏర్పాటు చేశారు. బడ్జెట్ సెషన్ ప్రథమార్ధంలో 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు తొమ్మిది సమావేశాలు ఉంటాయి. బడ్జెట్ ప్రతిపాదనల పరిశీలన నిమిత్తం పార్లమెంట్ 13న విరామం తీసుకుంటుంది. వివిధ మంత్రిత్వశాఖల బడ్జెట్ పద్దులపై చర్చించేందుకు, బడ్జెటరీ ప్రక్రియను పూర్తి చేసేందుకు పార్లమెంట్ తిరిగి మార్చి 10న సమావేశం అవుతుంది. సమావేశాలు ఏప్రిల్ 4న ముగుస్తాయి. మొత్తం బడ్జెట్ సెషన్‌లో 27 సిట్టింగ్‌లు ఉంటాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్