ఇప్పుడు మరింత బాధ్యత పెరిగింది

- Advertisement -

ఇప్పుడు మరింత బాధ్యత పెరిగింది

Now the responsibility has increased

హోం మంత్రి వంగలపూడి అనిత
అనకాపల్లి
పాయకరావుపేట నియోజకవర్గం ప్రజలు అత్యధిక మెజార్టితో గెలిపించారు. ఇప్పుడు మరింత బాధ్యత పెరిగింది. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పని చేస్తున్నాం. వంద రోజులకు వందరోజులు కూడా పని చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. గత ప్రభుత్వంలో మే నెలలో వృధ్ధాప్య పెన్షన్ విషయంలో నానా ఇబ్బందు లు పెట్టారని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. సచివాలయం సిబ్బందే ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నారు. మూడు నెలలుగా ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదికే జీతం వస్తుంది. భూమి పై కూడా మీ పెత్తనం లేకుండా చేయాలని చూసారు. గత ఐదు సంవత్సరాలు రాజధాని ఏదో తెలియని పరిస్థితి. జగన్ మోహన్ రెడ్డి కేసులు మాఫీ కోసమే డిల్లి వెళ్ళేవారు. జగన్ మోహన్ రెడ్డి లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసారని అన్నారు. ఉపముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభలు ఏర్పాటు చేసి,రికార్డు సృష్టించారు.
అతి త్వరలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తాం. గతంలో ముఖ్యమంత్రి పరదాల చాటున పర్యటన ఉండేది. ఫిర్యాదుల బాక్స్ లు ఏర్పాటు చేస్తున్నాం. సమస్యలకు పరిష్కారం చూపిస్తాం. గంజాయి విపరీతంగా పెరిగిపోయింది. చిన్న చిన్న పిల్లలు గంజాయి మత్తుకు బానిసలు అవుతున్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలో గంజాయి,మద్యం,సారా విషయంలో నాయకులు ఫోన్ చేసిన పోలీసులు పట్టించుకోవద్దు. తిరుపతి ప్రసాదంకు ఎంతో ప్రధాన్యత ఉండేది. తిరుపతి లడ్డు విషయంలో కూడా కల్తీ చేసారు అంటే ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి. తిరుపతి వెంకన్నస్వామి కోసం ఎవ్వరు తప్పుగా మాట్లాడినా పుట్టగతులు ఉండవు. దేవుడుతో కూడా వ్యాపారం చేసేసారని అన్నారు.  పోలం పిలుస్తోంది పోస్టర్ ను మంత్రి ఆవిష్కరించారు. ఉన్నతి బుణాల చెక్ ను మహిళలకు అందచేసారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular