అవెన్యూ ప్లాంటేషన్ పై అధికారుల భేటీ

- Advertisement -

Officials meeting on Avenue Plantation :

అవెన్యూ ప్లాంటేషన్ పై అధికారుల భేటీ
సిద్దిపేట
జిల్లాలోని నేషనల్ హైవే నిర్మాణ ప్రాంతమైన మిట్టపల్లి నుండి జిల్లా పరివాహక ప్రాంతం వరకు రోడ్డు వెంబడి అవెన్యూ ప్లాంటేషన్ గూర్చి సంబంధిత అధికారులకు జిల్లా అదనపు కలెక్టర్ గరీమా అగ్రవాల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో నేషనల్ హైవే ఇంజనీరింగ్ అధికారులు, జిల్లా అటవీశాఖ, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, జిల్లా గ్రామపంచాయతీ  శాఖ అధికారులు పాల్గోన్నారు.
అదనపు కలెక్టర్ మాట్లాడుతూ. మిట్టపల్లి నుండి జిల్లా పరివాహక గ్రామాల వరకు సుమారు 14 గ్రామాలలో నేషనల్ హైవే రోడ్డు నిర్మాణం పూర్తయిన రోడ్డు వెంబడి అవెన్యూ ప్లాంటేషన్ పెట్టేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలి. దాదాపు 14000 మొక్కలు పెట్టేందుకు ఆస్కారం ఉందని తెలిపారు. కొత్త రోడ్డు పక్కన లాండ్ లెవెలింగ్ చేసి ఫారెస్ట్ నుండి మొక్కలు పెట్టే ప్రాంతాలకు మొక్కలను రవాణా చేయాలని నేషనల్ హైవే అధికారులకు తెలిపారు. చాలు చేసిన ప్రాంతాలలో మార్కింగ్ చెయ్యాలని అడవి శాఖ అధికారులకు, మార్కింగ్ చేసిన ప్రాంతాల్లో ఫిట్టింగ్, మొక్కలను పెట్టడం, ట్రీ గార్డ్ అమర్చడం మరియు మెయింటెనెన్స్ బాధ్యత పూర్తిగా గ్రామపంచాయతీ అధికారులదే, రోడ్డు నిర్మాణం పూర్తయిన ప్రాంతాన్ని మొత్తం ఒకసారి పర్యవేక్షణ చేయాలని డిఆర్డిఏ మరియు ఫారెస్ట్ అధికారులకు సూచించారు. ఆయా గ్రామాల పంచాయతీ సెక్రటరీలు  మీ పరిధిగల రోడ్డు వెంబడి మొక్కలను అత్యంత శ్రద్ధ తీసుకొని ఏపుగా పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular