అధికారులు గ్రమాభివృద్ధిపై అవగాహన కలిగివుండాలి

- Advertisement -

అధికారులు గ్రమాభివృద్ధిపై అవగాహన కలిగివుండాలి

Officials should be aware of village development

గ్రామ పంచాయితీ ప్రత్యేక అధికారులు గ్రామ పంచాయితీ విధులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
గ్రామాల అభివృద్ధి లో గ్రామ పంచాయితీ ప్రత్యేక అధికారుల విధులు చాలా కీలకం.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
జయశంకర్ భూపాలపల్లి,
గ్రామ పంచాయితీ ప్రత్యేక అధికారులు గ్రామ పంచాయితీ విధులపై సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు.
శుక్రవారం ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో  భూపాలపల్లి నియోజక వర్గ పరిధిలోని మండల ప్రత్యేక అధికారులు, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు,  తహసీల్దార్లు, ఎంపిడిఓలతోగ్రామపంచాయితీ విధులు, బాధ్యతలు, పారిశుధ్యం, చెట్లు పెంపకం, గ్రామ పంచాయితీలు అభివృద్ధి, వీధి దీపాలు, జనన మరణాల రిజిస్ట్రేషన్, ప్రజారోగ్యం తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
అధికారులకు పిపిటి ద్వారా వివరించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొని అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ధేశిత లక్ష్యాలను గ్రామాలలో క్షేత్ర స్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారలదేనని అన్నారు. సర్పంచ్ ల మాదిరిగానే గ్రామ పంచాయతి ప్రత్యేక అధికారులకు అన్ని రకాల అధికారాలు కల్పించడం జరిగిందని తెలిపారు. గ్రామ పంచాయితీ ప్రత్యేక అధికారులకు గ్రామ పంచాయితీ విధులపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని,  ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికీ అందేవిధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ప్రతి రెండు రోజులకు ఒకసారి కచ్చితంగా గ్రామాలను పరిశీలించాలని అన్నారు.  ప్రతి రోజు సాయంత్రం పంచాయితీ కార్యదర్శులతో మాట్లాడి గ్రామాల సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ…..
ప్రత్యేక అధికారుల విధులు చాలా కీలకమైనవని సేవల్లో  మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. గ్రామ స్థాయిలో అన్ని శాఖల సిబ్బందితో తరచూ సమీక్షలు నిర్వహించి గ్రామాల అభివృద్ధికి అవసరమైన మౌలిక సౌకర్యాలు కల్పించి గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అన్నారు. గ్రామాలలో కనీస అవసరాలైన
విద్యుత్, పారిశుధ్యం, సీజనల్ వ్యాధలు ప్రబల కుండా రక్షణ చర్యలు, పెండింగ్ లో ఉన్న రోడ్లు, మురుగునీటి కాల్వల పనులు వేగంగా పూర్తి చేయాలని అన్నారు.
ప్రతి రోజు గ్రామాల్లో  పర్యటించి ఉద్యోగులకు ఎప్పటికప్పుడు తగు సూచనలు చేయాలని అన్నారు. ప్రత్యేక అధికారులకు గ్రామాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి అని ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రణాళిక బద్ధంగా  ప్రత్యేక అధికారులు గ్రామాలను అభివృద్ధి చేయాలని అన్నారు. సర్పంచ్ ఎన్నికలు జరిగే వరకు పూర్తి స్థాయిలో బాధ్యతలు నిర్వహించాలని సీజనల్ వ్యాధులపై ప్రజలకు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించి అప్రమత్తం చేయాలని అన్నారు. గణేష్ నిమజ్జనం, దసరా, సద్దుల బతుకమ్మ పండుగలకు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
పంట నష్టం, వరద ప్రభావిత నష్టాలను  అంచనాలు వేసి జిల్లా కలెక్టర్ కు నివేదిక అందించాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో  స్థానిక సంస్థల అదనపు కలెక్టర్
విజయ లక్ష్మి, డిపిఓ నారాయణ రావు, మండల ప్రత్యేక అధికారులు తహసీల్దార్లు, ఎంపిడిఒ లు గ్రామ పంచాయితీ ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular