28.7 C
New York
Sunday, June 23, 2024

ఆపరేషన్ ఆకర్ష్… ఫెయిలైందా…

- Advertisement -

ఆపరేషన్ ఆకర్ష్… ఫెయిలైందా…
ముగ్గురితో ముగింపేనా
హైదరాబాద్, ఏప్రిల్ 22
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ హైప్ ఇచ్చిన ఎమ్మెల్యేల చేరికల అంశం క్రమంగా బెదిరింపుల జాబితాలోకి చేరుతోంది. పార్లమెంట్ ఎన్నికలకంటే ముందే ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున చేర్చుకుంటామని బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ప్రకటనలు చేశారు. కానీ ఇప్పుడు ప్రత్యేకమైన కారణాలతో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలు తప్ప మిగిలిన వారు వెనుకడుగు వేస్తున్నారు. శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా చివరి క్షణంలో ఆగిపోయారు. తన మనవరాలితో  తన తాత కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదన్న ప్రకటన చేయించారు. ప్రభుత్వాన్ని కూల్చేస్తామన్న హెచ్చరికలు క్రమంగా పెరుగుతూండటంతో రేవంత్ రెడ్డి ముందు జాగ్రత్త  పడుతున్నారు. మొదట్లో ఆయన ఎమ్మల్యేలను చేర్చుకోవాలని అనుకోలేదు. కానీ ప్రభుత్వ మనుగడపై పదే పదే బీఆర్ఎస్, బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేస్తూండటంతో ఆయన ఎమ్మెల్యేలను ఆకర్షించాలని నిర్ణయించుకున్నారు. చాలామంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని సంకేతం ఇవ్వడానికి ముందస్తుగా మర్యాదపూర్వక భేటీలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీతో పాతిక మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారన్న అభిప్రాయాన్ని కల్పించేందుకు  ప్రయత్నించారు. బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయే నేతలు పెరిగిపోతూండటంతో.. బీఆర్ఎస్ఎల్పీ విలీనం ఖాయమనుకున్నారు. కానీ రాను రాను పరిస్థితి నెమ్మదించింది. లోక్ సభ టిక్కెట్లు ఆఫర్ చేసిన వారు మాత్రమే పార్టీలో చేరారు. మిగిలిన వారు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్లగా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు కానీ..అందర్నీ ఒకే సారి చేర్చుకుని షాకివ్వాలని అనుకోవడం లేదు. ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ఎల్పీ విలీనం పూర్తి చేసి.. కేసీఆర్ నైతిక స్థైర్యం దెబ్బతీయాలని అనుకున్నారన్న ప్రచారం జరిగింది. కానీ అక్కడొక ఎమ్మెల్యే.. ఇక్కడొక ఎమ్మెల్యే తప్ప.. అందరూ కలసి కట్టుగా వచ్చి చేరే అవకాశాలు కనిపించడం లేదు.  ఇప్పటికే ముగ్గురు మాత్రమే కాంగ్రెస్ లో చేరారు.  దానం నాగేందర్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా  పోటీ చేయడం కోసం చేరారు. ఒక వేళ ఓడిపోతే ఆయనకు మంత్రి పదవి ఇస్తారమని ఆఫర్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. కడియం శ్రీహరి కూడా పార్టీలో చేరారు. ఆయన కుమార్తెకు లోక్ సభ టిక్కెట్ ఖరారు చేశారు. అలాగే ఖమ్మం జిల్లాకు చెందిన ఏకైక బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు కూడా కాంగ్రెస్‌లో చేరారు. ఆయనకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయ గురవు. అందుకే ఆయన ఫలితాలు వచ్చిన రోజునే కాంగ్రెస్ పార్టీ క్యాంపులో కనిపించారు. రపఆయన చేరికపై పెద్దగా ఎవరూ ఆశ్చర్యపోలేదు. ఇటీవల తుక్కుగూడలో నిర్వహించిన బహిరంగసభలోనే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం చేశారు. ఓ పదహారు మంది ఎమ్మెల్యేల పేర్లు ప్రచారంలోకి వచ్చారు. దాదాపుగా అందరూ ఖండించారు. ఎవరూ పార్టీలో చేరలేదు కూడా. నిజానికి చేరుతారని కాంగ్రెస్ పార్టీ కూడా ప్రకటించలేదు. తాజాగా కేసీఆర్ తమతో ఇరవై మంది ఎమ్మెల్యేల టచ్‌లో ఉన్నారని ప్రకటించగానే.. ఓ ఎమ్మెల్యేను అయినా పార్టీలో చేర్చుకుని షాకివ్వాలనుకన్నారు. ప్రకాష్ గౌడ్ చేరేందుకు సిద్ధమైనా ఆయన ఆగిపోయారు. ఇలాంటి వారు చాలా మంది ఉన్నారని  పార్టీలో చేరేందుకు సమయం కావాలని అడుగుతున్నారు. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ఫలితాల ఆధారంగానే చేరికలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ పది స్థానాల వరకూ గెల్చుకుంటే ఆ పార్టీకి తిరుగు ఉండదు. బీజేపీ మెజార్టీ స్థానాలను దక్కించుకుంటే రాజకీయం అంతా మారిపోతుందన్న అంచనాలు ఉన్నాయి. బీజేపీకి పరోక్షంగా సాయం చేసేందుకు బీఆర్ఎస్ రెడీ అయిందని చెబుతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడే్ కాంగ్రెస్ పార్టీలో చేరితే.. తర్వాత సమస్యలు వస్తాయని.. పరిస్తితుల్ని బట్టి నిర్ణయాలు తీసుకుందామన్న ఆలోచనలో ఇతర ఎమ్మెల్యేలు ఉన్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత రేవంత్ ప్రభుత్వం స్థిరంగా ఉంటుదనుకుంటే.. పోలోమంటూ ఎమ్మెల్యేలు చేరిపోడం ఖాయం అనుకోవచ్చు.  బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ లోక్ సభ సీట్లు గెల్చుకోవడం అసాధ్యమని అందరూ నమ్ముతున్నారు. ఆ పార్టీ నేతలు కూడా నమ్మకంగా లేరు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బీజేపీ ఉపేక్షించదని అనుకుంటున్నారు. కేసీఆర్ కూడా అదే చెబుతున్నారు. కానీ అదంతా మైండ్ గేమ్ రాజకీయమని..  పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పది కన్నా తక్కువ సీట్లు వచ్చే అవకాశమే  లేదని కాంగ్రెస్ నేతలు నమ్ముతున్నారు. కాంగ్రెస్ లో చేరేందుకు అంత ఆసక్తి చూపించకపోయినా బీఆర్ఎస్ లో మాత్రం ఎవరూ యాక్టివ్  గా ఉండం లేదు. పార్టీలో ఉన్నామంటే ఉన్నామన్నట్లుగా సమావేశాలుక  హాజరవుతున్నారు కానీ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో అంత యాక్టివ్ గా కనిపించడం లేదు. పైగా  కాంగ్రెస్ అభ్యర్థులకు కొన్ని చోట్ల.. బీజేపీ అభ్యర్థులకు కొన్ని చోట్ల సహకరిస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి దగ్గరగానే ఉంటున్నారు. సుధీర్ రెడ్డి లాంటి వారి సంగతి చెప్పాల్సిన పని లేదు. రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వక భేటీలకు హాజరై.. తమకు ఉన్న సమస్యలను పరిష్కరించుకున్నారు కానీ పార్టీ మారే ఆలోచన చేస్తున్నారో లేదో స్పష్టత లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చే ఫలితాలను బట్టే తర్వాత రాజకీయం ఉంటుందని భావిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ తమ ఓటు బ్యాంక్ ను కూడా నిలుపుకోవడానికి కష్టపడితే అప్పుడు మిగిలిన ఎమ్మెల్యేల తమ దారి తాము చూసుకునే అవకాశం ఉంది. అయితే వారి చాయిస్ కాంగ్రెస్ నా బీజేపీనా అన్నది కూడా ఎన్నికల్లో వచ్చే ఫలితాలను బట్టే ఉండవచ్చు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!