Friday, April 4, 2025

మా భూమిని మాకు ఇప్పించి కొత్త పట్టాదారు పాసుబుక్ లు ఇవ్వాలి

- Advertisement -

మా భూమిని మాకు ఇప్పించి కొత్త పట్టాదారు పాసుబుక్ లు ఇవ్వాలి

Our land should be given to us and new passbooks should be given
 వెలుగుమట్ల భూధన్ భూముల రైతులు

ఖమ్మం

స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల వెలుమట్ల గ్రామపంచాయితీ నిరుపేద బడుగు , బలహీన వర్గాల రైతులు మాట్లాడుతూ మేము గత 30 సంవత్సరాలుగా మొత్తం 27 మంది రైతులము సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు . భూమి మొత్తం సర్వే నెంబరు 147, 148 మరియు 149లో 31 ఎకరాల 7 కుంటల భూమి మేము సాగు చేసుకుంటున్నాము . ఈ భూమి మా తాతల నుండి వంశపారపర్యంగా మాకు సంక్రమించింది . ఈ భూమి పై సర్వ హక్కులు మాకే ఉన్నవి . గత 3 సం||ల క్రితం నుండి కొంత మంది వ్యక్తులు మా వ్యవసాయ భూమిని దౌర్జన్యంగా ఆక్రమించారు . ఈ భూమి మాది అని మేము అందరము అక్కడికి వెళ్ళగా మా మీదకు ఆడవాళ్ళను ఉసిగొల్పి దౌర్జన్యంగా మమ్ములను తిడుతున్నారు . ఈ విషయపై గతంలో మేము అందరము ఖమ్మం జిల్లా కలెక్టర్ కి విన్నవించుకోగా కలెక్టర్ మా భూమిని పరిశీలించి ఆ వ్యవసాయభూమి ఈ 27 మంది రైతులకే చెందుతుంది అని చెప్పి అక్కడ వాళ్ళకు మేము న్యాయం చేస్తాము మీరు ఖాళీ చేయండి అని  చెప్పినారు . ఇంత వరకు మా భూమిని ఆక్రమించిన వాళ్ళు ఇంకా అక్కడే గుడిసెలు వేసుకొని ఉంటున్నారు . ఈ విషయమై హైకోర్టు వి పీ .No. 29021 / 2019,  31.12.2019 మా 27 మంది రైతులకు అనుకూలముగా ఆర్డరు ఇచ్చినది . కావున మా యందు దయ ఉంచి జిల్లా కలెక్టర్ తక్షణమే చర్యలు తీసుకొని మా మా భూమిని మాకు ఇప్పించి అక్కడ వేసిన గుడిసెలు తొలగించి మాకు న్యాయం చేయాలని పత్రికముకంగా వేడుకున్నారు . ఇట్టి భూమికి మాకు క్రొత్త పట్టాదార్ పాసుపుస్తకము ఇవ్వగలరని ప్రభుత్వాన్ని మరియు సంబంధించిన అధికారులను కోరారు . ఈ కార్యక్రమంలో బందెల వెంకన్న , బందెల కృష్ణ , షేక్ సొందు , షేక్ గోరే మియా , దోమల రాము , లకావత్తు నాగేశ్వరరావు , షేక్ సైదాబీ , షేక్ ఆశ , షేక్ జానీ మియా , మద్దె నాగమణి , బుచ్చి రాములు , దుర్గారావు ,  రామస్వామి , మోతిరయ్య , వెంకటరత్నం , వీరస్వామి , రమ , రాజారావు , బి వెంకన్న తదితరులు పాల్గొన్నారు .

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్