అంగవైకల్యం జయించి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలి::

- Advertisement -

అంగవైకల్యం జయించి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలి::ఎంఈఓ వెంకటేశ్వర్లు

Overcome disability and move forward with self-confidence:: MEO Venkateshwarlu

జగిత్యాల
అంగవైకల్యం ఉందని అధైర్య పడకుండా దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు నడవాలని మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు సూచించారు. మంగళవారం బుగ్గారం మండల విద్యా వనరుల కేంద్రంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు ఐ ఈ ఆర్ పి సమత ఆధ్వర్యంలో వివిధ రకాల ఆటలు నిర్వహించి బహుమతులు అందజేశారు. అనంతరం ఎంఈఓ మాట్లాడుతూ అంగవైకల్యాన్ని జయించి ఎన్నో అద్భుత విజయాలు సాధించిన వారిని స్ఫూర్తిగా తీసుకొని జీవితంలో ఉన్నత శిఖరాల అధిరోహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బుగ్గారం జడ్పిహెచ్ఎస్ ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, సీ ఆర్ పి పురుషోత్తం, ఎం ఐ ఎస్ రాజేష్, సిసిఓ హరిత, దివ్యాంగుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular