వాయిస్ టుడే వరంగల్ జిల్లా బ్యూరో
-2005లో స్థాపితమైన భక్త మార్కండేయ పరపతి సంఘం
-మొదటి సారి ఒక ఎమ్మెల్యేకు పూర్తి మద్దతుగా
తీర్మానం చేసిన ఆమోద పత్రాన్ని అందజేత
-మీకు ఋణపడి ఉంటా
-స్వచ్ఛందంగా నాకు మద్దతుగా తెలిపి పద్మశాలిల అభివృద్ధికి అండగా ఉంటా
-వరంగల్ తూర్పు ఎమ్మెల్యే,బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నన్నపునేని
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నేడు గుర్తుండిపోయే రోజు పద్మశాలీలు అంతా ఒకటే వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే,బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నన్నపునేని నరేందర్ కు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేసి తమ ఆమోదపత్రాన్ని ఎమ్మెల్యేలను నరేందర్ కి అందించారు
ఖిలా వరంగల్ పడమరకోటలో 2005లో స్థాపించబడిన శ్రీ భక్త మార్కండేయ పరపతి సంఘం నేడు సంచలన నిర్ణయం తీసుకుంది చరిత్రలో నిలిచిపోయే విధంగా 2005 నుండి నేటి వరకు ఏ ఒక్క ఎమ్మెల్యేకు వారి పూర్తి మద్దతు తెలుపలేదు కానీ నేడు వారి సంఘ అభివృద్ధికి సహకరించి సుమారు 33 లక్షల నిధులను కేటాయించి ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారికి అండగా నిలుస్తున్న ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కి శ్రీ భక్త మార్కండేయ పరపతి సంఘం వారి పూర్తి మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేసి ఆమోద పత్రాన్ని నేడు ఖిలా వరంగల్ పద్మశాలి భవన్ లో ఎమ్మెల్యే నరేందర్ కు అందజేశారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
శ్రీ భక్త మార్కండేయ పరపతి సంఘం 2005లో స్థాపించబడి నేటి వరకు ఒక శాసనసభ్యునికి పూర్తి మద్దతు తెలిపిన చరిత్ర లేదు కానీ నేడు ఆ అదృష్టం నాకు దక్కింది మీ పూర్తి మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేసి ఆ ఆమోదపత్రాన్ని నాకు అందించారు అది నా పూర్వజన్మ సుకృతం
మీకు ఎల్లవేళలా రుణపడి ఉంటా పద్మశాలీల అభివృద్ధికి నేను నిరంతరం కృషి చేస్తా
రాబోవు ఎన్నికల్లో మీతో పాటు మీ చుట్టూ ఉన్న వాళ్ళందరిని కారు గుర్తుపై ఓటు వేసి నన్ను అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా మనవి
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్,శ్రీ భక్త మార్కండేయ పరపతి సంఘం అధ్యక్షులు వారి కార్యవర్గం, మహిళలు పద్మశాలి పెద్దలు ముఖ్య నాయకులు హాజరయ్యారు