Tuesday, January 14, 2025

జనవరి మొదటివారంలో పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు

- Advertisement -

జనవరి మొదటివారంలో పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు

Panchayat reservations will be finalized in the first week of January

హైదరాబాద్
గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముమ్మర కసరత్తు సంక్రాంతి తర్వాత షెడ్యూల్ విడుదల మూడు విడతల్లో ఎన్నికలు బ్యాలెట్ పేపర్ ద్వారానే స్థానిక సమరం సర్పంచ్‌కు పింక్ కలర్, వార్డు సభ్యుడికి వైట్ కలర్ బ్యాలెట్లు 12,815 గ్రామ పంచాయతీలు 1.14లక్షల వార్డు సభ్యుల స్థానాలు.
రాష్ట్రంలో వచ్చే ఏడాది నిర్వహించబోయే స్థానిక ఎన్నికలపై ప్రత్యేక ప్రభుత్వం దృష్టి సారించనుం ది. ముందు పంచాయతీ ఎన్నికలు, తర్వాత ఎంపిటిసి, జడ్‌పిటిసి ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపల్, నగర పాలక సంస్థల ఎన్నికలను వరుసగా నిర్వహించేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఉన్న సాను కూలతను సొంతం చేసుకునేందుకు ఇప్పటికే స్థానిక ఎన్నికల కు సిద్ధమవుతోంది. ముందుగా పంచాయతీరాజ్ చట్ట సవరణకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేసిన ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల్లో తన హ వా చాటాలని కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. సర్పంచ్‌లు, ఎంపీపీ, జడ్పీ చైర్మ న్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీకాలం ఇప్పటికే ముగిసింది. ముందు సర్పంచ్ ఎన్నికలు, ఆ తర్వా త ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అందుకనుగుణంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. స్థానిక ఎన్నికలకు జనవరి మొదటివారంలో రిజర్వేషన్ల ప్రక్రియ పూ ర్తి కానుండడంతో సంక్రాంతి తర్వాత గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్నట్టుగా తెలిసింది.
మూడు విడతల్లో ఈ పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భా విస్తున్నట్టుగా సమాచారం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి కులగణనకు సంబంధించి పూర్తి నివేదిక అందిందని ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా తెలిసింది. ఎన్నికల కమిషన్ కూడా దీనికి సంబంధించిన చర్యలకు సమాయత్తం అవుతున్నట్టుగా సమాచారం. ఈ సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీతో సర్పంచు ల పదవీ కాలం ముగియగా, జూలై 3వ తేదీన ఎం పిటిసి, జడ్పిటిసి సభ్యుల పదవీ కాలం ముగిసింది. ప్రజాప్రతి నిధుల స్థానంలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కు అవసరమైన ఏర్పాట్లను ఎన్నికల సంఘం చేపడుతోంది. జనవరి 14వ తేదీన ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేస్తే, ఆ తర్వాత 21 రోజుల్లో ఫిబ్రవరి మొదటి వారంలో, ఎన్నికలు నిర్వహించే లా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టుగా సమాచారం. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి మండలానికి కనీసం ఐదు గ్రామ ఎంపిటిసి స్థానాలు, ఉండేలా అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
బ్యాలెట్ పేపర్ ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలు
గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు విడతలు గా నిర్వహించాలని నిర్ణయించిన ఎన్నికల సంఘం ఆ ప్రకారం ఒక్కో జిల్లాలోని మండలాల కు మూడు విడతలుగా ఎన్నికలను నిర్వహించనున్నట్టుగా తెలిసింది. దీంతోపాటు ఈ స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించాలని నిర్ణయించినట్టు సమాచారం. అందులో భాగం గా సర్పంచ్‌కు పింక్, వార్డు సభ్యుడికి వైట్ కలర్ బ్యాలట్ పేపర్ ఉపయోగించనున్నట్టుగా తెలిసింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్