- Advertisement -
రాష్ట్ర ప్రభుత్వానికి అంబులెన్స్ అందించిన పర్వతనేని ఫౌండేషన్
ఉండవల్లిలో సీఎం చంద్రబాబు చేతుల మీదగా ప్రభుత్వానికి అందజేత
అమరావతి :
Parvaneni Foundation, which provided an ambulance to the state government
ప్రభుత్వానికి పర్వతనేని ఫౌండేషన్ తరపున అంబులెన్స్ ను అందజేశారు. పర్వతనేని ఫౌండేషన్ – లుగాంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఉండవల్లిలో సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ అంబులెన్స్ ను ప్రభుత్వానికి అందజేశారు. దివంగత టీడీపీ నేత కేంద్రమాజీ మంత్రి పర్వతనేని ఉపేంద్ర 88వ జయంతి సందర్భంగా పర్వతనేని ఫౌండేషన్ నుండి ఆయన తనయుడు పి.వివేక్ ఆనంద్ అంబులెన్స్ ను అందించారు. క్రిటికల్ కేర్ వైద్యంలో ఈ అంబులెన్స్ కీలకంగా పని చేస్తుందని ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. అంబులెన్స్ అందించిన పర్వతనేని ఫౌండేషన్ సెక్రటరీ, కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుమారుడు వివేక్ ఆనంద్ ను సీఎం చంద్రబాబు అభినందించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో జనరల్ సెక్రటరీగా పని చేసిన పర్వతనేని ఉపేంద్రతో తన అనుబంధాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పర్వతనేని ఉపేంద్ర కుటుంబ సభ్యులు, లుగాంగ్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
- Advertisement -