- Advertisement -
వరద బాధితులకు నిత్యవసర సరుకుల కిట్లను పంపిణీ చేసిన పత్తికొండ ఎమ్మెల్యే కే.ఈ శ్యాంబాబు
Pathikonda MLA KE Shyambabu distributed essential goods kits to the flood victims బాధితుల కుటుంబాల ఇంటి వద్దకు వెళ్లి కిట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
పత్తికొండ
గత కొద్ది రోజులలో రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు విజయవాడ పరిసర ప్రాంతాలలో బుడమేరు వాగు పొంగిపొర్లడంతో విజయవాడ పరిసర ప్రాంతాలు గత కొద్దిరోజులుగా అంధకారంలోకి వెళ్లాయి.రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై యుద్ధ ప్రాతిపదికన రాష్ట్ర మంత్రులు, అధికారులు బుడమేరు వాగు గండ్లు పూడ్చడంతో వరద బాధ నుండి విజయవాడ పరిసరాల ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.వరద బాధితుల కొరకు రాష్ట్రవ్యాప్తంగా పలువురు పెద్ద ఎత్తున సీఎం సహాయ నిధికి విరాళాలను అందజేస్తున్నారు. అదేవిధంగా పత్తికొండ నియోజకవర్గ పరిధిలోని గల తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యే కే.ఈ శామ్ బాబు ఆదేశాల మేరకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గ్రామాల తరఫున విరాళాలను అందజేశారు.భారీ వరద కారణంగా కంటికి కునుకు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో విజయవాడ వరద బాదితుల సహాయార్థం కోసం స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు స్వయంగా వరద బాదితుల సంరక్షణ కొరకు చేస్తున్న సహాయంలో పాలు పంచుకునేందుకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పత్తికొండ శాసనసభ్యులు కేయి శ్యామ్ కుమార్ పత్తికొండ నియోజకవర్గంలోని ఐదు మండలాల నుండి సేకరించిన ఆర్ధిక సాహయంను వరద భాదితులకు అందజేసిన అనంతరం విజయవాడ 43 వ డివిజన్ నందు భవానిపురం ప్రాంతంలోని ఊర్మిళ నగర్ కాలనిలో ఉన్న వరద బాధితులకు పత్తికొండ ఎమ్మెల్యే కే.యి శ్యామ్ కుమార్ సందర్శిస్తూ నిత్యావసర సరుకులను తానే స్వయాన భుజాన వేసుకుని ప్రతి ఇంటింటికి వెళ్లి అందరి వరద బాధితులకు నిత్యావసర సరుకులను స్వయంగా అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాధితులతో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటుందని,చంద్రబాబు నాయకత్వంలో బాధ్యత కుటుంబాలకు తగిన న్యాయం జరుగుతుందని ఆయన బాధితులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లాలోని గల శాసన సభ్యులు,జిల్లా నాయకులు తదితర సభ్యులందరూ హాజరై కర్నూలు జిల్లా తరఫున కోటి 50 లక్షలు విలువ చేసే పదివేల నిత్యవసర కిట్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహన కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర,పత్తికొండ నియోజకవర్గంలోని ఐదు మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -




