- Advertisement -
రేషన్ బియ్యం దందాపై పవన్ ఆగ్రహం
Pawan angry over ration rice danda
విజయవాడ, నవంబర్ 30, (వాయిస్ టుడే)
ఏపీలో రేషన్ బియ్యం దందాపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల బియ్యం విదేశాలకు తరలిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కాకినాడ పోర్టు నుంచి సౌత్ ఆఫ్రికా కు 640 టన్నుల బియ్యంతో వెళ్తున్న షిప్ పట్టుబడిన సంగతి తెలిసిందే. కాకినాడ జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పీ ఆ షిప్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్,మంత్రి నాదెండ్ల మనోహర్ పట్టుబడిన షిప్ తో పాటు బియ్యాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్న స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులకు బాధ్యత లేదా?అని ప్రశ్నించారు.వైసిపి ప్రభుత్వ హయాంలో భారీగా కాకినాడ పోర్టు నుంచి బియ్యం తరలిపోవడంపై పవన్ విమర్శలు వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చినా.. ఇంకా బియ్యం తరలిపోతుండడంపై ఆవేదన వ్యక్తం చేశారు పవన్అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యే ఒకరు కీలకంగా వ్యవహరించారు ఈ దందాలో. ఆయనపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. పవన్ సైతం ఆయన పేరును ప్రస్తావిస్తూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కూడా. అయితే అదే కాకినాడ పోర్టు నుంచి ఇప్పుడు కూడా రేషన్ బియ్యం తరలిపోతుండడం పై సీరియస్ గా ఉన్నారు పవన్. ఇంత జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు ఏం చేస్తున్నట్టు అని ప్రశ్నించారు.రేషన్ బియ్యం మాఫియా కు కాకినాడ పోర్టు హబ్ గా మారిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బియ్యం మాఫియా వెనుక ఎంతటి వారున్నా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు పవన్.మరోవైపు పవన్ ఆదేశాలతో అధికారులు ఉరుకులు, పరుగులు పెట్టారు. కొద్ది రోజుల కిందట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పోర్టు ప్రాంతాన్ని పరిశీలించారు. బియ్యం తరలింపు విషయంలో సీరియస్ ఆదేశాలు జారీ చేశారు. కానీ అక్కడ బియ్యం తరలింపు ప్రక్రియ మాత్రం ఆగలేదు. ఇంకా పెరుగుతుండడం పై స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ రంగంలోకి దిగారు. నేరుగా సౌత్ ఆఫ్రికాకు బియ్యంతో వెళ్తున్న షిప్ ను పరిశీలించారు. అక్కడికక్కడే సీరియస్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికార యంత్రాంగంలో ఒక రకమైన చలనం ప్రారంభం అయ్యింది. మరోవైపు రాష్ట్రస్థాయిలో బియ్యం మాఫియా విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఆఫ్రికాకు రేషన్ బియ్యం
వైసిపి హయాంలో కాకినాడ పోర్టు ద్వారా భారీగా బియ్యం తరలిపోతున్నాయని అప్పట్లో కూటమి నేతలు ఆరోపించారు. దీని వెనుక వైసీపీ నేతలు ఉన్నారన్నది అప్పట్లో కూటమి నేతల నుంచి వినిపించిన మాట.అయితే ఇప్పటికీ రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడడం లేదు. గతంలో కాకినాడ పోర్టులో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వరుస తనిఖీలు కూడా చేశారు. అయినా సరే ఎటువంటి మార్పు రాలేదు. తాజాగా కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యంతో వెళ్తున్న ఓ సౌతాఫ్రికా షిప్ ను కాకినాడ జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పీ పట్టుకున్నారు. షిప్ లో దాదాపు 640 టన్నుల అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ షిప్ పరిశీలించేందుకు డిప్యూటీ సీఎం పవన్ తో పాటు మంత్రి నాదెండ్ల మనోహర్ వెళ్ళనున్నారు. సౌత్ ఆఫ్రికా షిప్ తో పాటు లాంచీలో వేలాది టన్నుల బియ్యం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.దీంతో దానిని కూడా పవన్,మనోహర్ లు కలిసి పరిశీలించనున్నారు. ప్రభుత్వం ఎన్ని రకాల కట్టడి చర్యలు చేపట్టినా రేషన్ బియ్యాన్ని ఆఫ్రికన్ దేశాలకు బియ్యం మాఫియా తరలిస్తూనే ఉంది. ముఖ్యంగా కాకినాడ కేంద్రంగా ఈ దందా నడుస్తూనే ఉంది.ఈ బియ్యం తరలింపు వెనుక లవన్ ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ సంస్థను గుర్తించారు. పవన్ స్వయంగా రంగంలోకి దిగుతుండడం సంచలనం అవుతోంది. అక్కడికక్కడే దీనిపై అధికారులకు ఆదేశాలు ఇవ్వబోతున్నారు పవన్. దీంతో పవన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో విపక్షంలో ఉన్నప్పుడు కాకినాడ పోర్టు నుంచి బియ్యం తరలింపు పై చాలా సందర్భాల్లో మాట్లాడారు పవన్. ఇప్పుడు అధికారిక హోదాలో అక్కడకు వెళ్తున్నారు. దీంతో పవన్ ఎటువంటి ఆదేశాలు ఇవ్వబోతారో అన్న చర్చ నడుస్తోంది.అయితే కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం తరలింపు ఇప్పటిది కాదు. గతం నుంచి కూడా ఈ దందా కొనసాగుతూనే ఉంది. వివిధ జిల్లాల నుంచి రేషన్ బియ్యం రోడ్డు మార్గంలో ఇక్కడికి చేరుకుంటుంది. అనంతరం నౌకల ద్వారా విదేశాలకు తరలిపోతుంది. ముఖ్యంగా ఆఫ్రికన్ దేశాలకు ఈ బియ్యం తరలిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఉక్కు పాదం మోపాల్సిన అవసరం ఉంది.
- Advertisement -