33.3 C
New York
Tuesday, July 16, 2024

వారాహి అమ్మవారి దీక్షలో పవన్

- Advertisement -

వారాహి అమ్మవారి దీక్షలో పవన్
విజయవాడ, జూన్ 25,
వారాహి అమ్మవారి దీక్ష  దేవి భక్తులకు దీని గురించి చెప్పనక్కర్లేదు. చాలామందికి ఈ తరహా దీక్ష ఉందని తెలీదు కూడా. ఇప్పుడు ఈ దీక్ష సిద్ధమవుతున్నారు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్.  11 రోజులపాటు అమ్మవారి దీక్షలో నిమగ్నం కానున్నారు. ఇంతకీ ఈ దీక్ష ఉద్దేశం ఏంటి? ఎందుకు 11 రోజులు మాత్రమే చేస్తారు?.గడిచిన ఎన్నికల్లో జనసేన పార్టీ 21 అసెంబ్లీ, రెండు ఎంపీ సీట్లను గెలుచుకుంది. ఆ క్రమంలో పవన్ కల్యాణ్ అమ్మవారికి మొక్కుకున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో దీక్షకు డిప్యూటీ సీఎం సిద్ధమైనట్టు చెబుతున్నారు. వారాహి అమ్మవారు లలితాదేవి సైన్యాధిపతి. శత్రు భయం ఉండ కూడదని దేవి భక్తులు ఆమెని ఆరాధిస్తారు. శత్రువులను జయించడం, జీవితంలో స్థిరత్వం రావడం, అరిషడ్వర్గాల నుంచి తన మనసును ఆధీనంలో ఉంచుకోవడం దీక్షలో కీలకమైనవి. ఇందుకోసం అమ్మవారి దీక్ష చేపడతారు.వారాహి అమ్మవారి దీక్ష జేష్ట్య మాసం చివర ఆషాడ మాసం మొదట్లో చేపడతారు. అన్ని దీక్షల మాదిరిగానే ప్రతిరోజూ తల స్నానం, మెడలో ఓ కండువా, చెప్పులు లేకుండా నడవడం, నేలపై నిద్రపోవడం, అమ్మ వారికి సంబంధించి స్తోత్ర పఠనం చేస్తారు. పాలు, పండ్లు తీసుకుంటారు. నవరాత్రి దీక్ష మాదిరిగానే తొమ్మిది రోజులు. కాకపోతే కొంతమంది 11 రోజులు చేస్తారు.డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన పాలన సవ్యంగా సాగాలని ఎలాంటి అడ్డంకులు రాకుండా చూడాలని ముఖ్యంగా శత్రువులను ఎదుర్కోవాలని వారాహి అమ్మవారి దీక్షలో నిమగ్నమవుతు న్నారు. మన దేశంలో వారణాసి, ఒడిషాల్లో అమ్మవారి ఆలయాలు ఉన్నాయి. చాలా రాష్ట్రాల్లో పలుచోట్ల వారాహి అమ్మవారి ఆలయాలు కొలువుతీరాయి.పురాణాల ప్రకారం దుర్గాదేవికి ఏడు ప్రతి రూపాలుగా సప్త మాత్తృకలుంటారు. వారిలో ఒకరు వారాహి అమ్మవారు. పురాణాల ప్రకారం అంధ కాసురుడు, రక్త బీజుడు, శుంభనిశుంభు వంటి రాక్షసులను సంహరించడంతో వారాహి అమ్మవారి ప్రస్తావన కీలకం. అమ్మవారు రూపం వారాహి ముఖంతో ఎనిమిది చేతులతో పాశం, నాగలి, శంఖ చక్రాలు వంటి ఆయుధాలతో కనిపిస్తుంది.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!