- Advertisement -
మరాఠా ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్
Pawan Kalyan in Maratha election campaign
డేగ్లూరు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీయే అభ్యర్థులకు మద్దతుగా జన సేన అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రు డేగ్లూరు నుంచి ప్రచారాన్ని శనివారం ఉదయం ప్రారంభించారు. డేగ్లూరులోని హెలిప్యాడ్ దగ్గర బీజేపీ, ఎన్డీయే పక్ష నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి పోటీ చేస్తున్న జితేశ్ రావ్ సాహెబ్ అంతాపుర్కార్, ఆయన కుటుంబం హారతులిచ్చి సత్కరించారు.
డేగ్లూరు లో జరిగిన సభలో పవన్ మాట్లాడుతూ నేను ఇక్కడికి కేవలం ఓట్లు అడగడానికి రాలేదు. ఎందరో మహనీయులు పుట్టిన నేల, ఎందరో సాధువులు నడిచిన నేల, మహానుభావులు ఉన్న నేల మీద గౌరవం తెలపడానికి వచ్చాను. చత్రపతి శివాజీ పుట్టిన నేల.. మన హక్కుల మీద పోరాటం నేర్పిన నేల మీద గౌరవం తెలపడానికి వచ్చాను.. స్వరాజ్యం అనే పదానికి అర్థం తెలిపిన నేలపై నాకున్న గౌరవం తెలపడానికి వచ్చానని అన్నారు.
గడచిన పదేళ్లుగా దేశంలో ఎన్డీఏ పాలనను గమనిస్తే ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ కనబడుతుంది. దివ్య రామమందిరంతో అలంకరించిన ఆయోధ్య కనబడుతుంది. ప్రపంచ పటంపై.. తిరంగా రెపరెపలాడుతూ కనబడుతోంది. ఎన్డీఏ పాలనలో దేశ నలూములలను కలిపే రహదారులు కనిపిస్తున్నాయి. పల్లెపల్లెకు విస్తరించిన రోడ్లు కనబడుతోంది. గడచిన పదేళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం 25 కోట్ల మంది భారతీయలను పేదరికం నుంచి విముక్తి చేసింది. 4 కోట్ల రైతులకు పంట బీమా అందించింది. పీఎం కిసాన్ ద్వారా 12 కోట్ల మందికి లబ్ది చేకూరింది. ముద్ర యోజన ద్వారా 30 కోట్ల మంది ఆడబిడ్డలకు చేయూత ఇచ్చింది. గత పదేళ్లలో హైవే మ్యాన్ ఆఫ్ ఇండియా నితిన్ గడ్కరీ 11 వేల కిలోమీటర్ల రహదారులు నిర్మించారు. మహారాష్ట్రలోని నాగ్ పూర్ నుంచి థానే వరకు 701 కిలోమీటర్ల సమృద్ది మహామార్గాన్ని నిర్మించారు. ఇది మహారాష్ట్ర నవనిర్మాణంలో కీలక ఘట్టమని అన్నారు. 2028 లోపు మహారాష్ట్రను లక్ష కోట్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే క్రమంలో ఇలాంటి గొప్ప అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. భారత దేశాన్ని ఐదు లక్షల ట్రిలియన్ల జీడీపీతో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా మార్చడంలో మహారాష్ట్ర కీలకపాత్ర పోషించబోతోంది. • హర్ ఘర్ జల్ యోజన కింద 50 శాతం పనులు పూర్తయ్యాయి. డేగ్లూర్ నియోజకవర్గంతో ఇదే వేగంతో అభివృద్ధి కొనసాగాలంటే, మహారాష్ట్రను లక్ష కోట్ల ఆర్ధిక వ్యవస్థ లక్ష్యంతో ముందుకు వెళ్తున్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరోసారి ఎన్నుకోవాలి. మీ కలలన్నీ సాకారం కావాలి అంటే ఎన్డీఏకు డేగ్లూర్ యువత, ఆడబిడ్డలు ప్రజల మద్దతు కావాలని అన్నారు.
- Advertisement -