- Advertisement -
ఏడీబీ రోడ్డు పనులు పరిశీలించిన పవన్ కళ్యాణ్
Pawan Kalyan inspected ADB road works
కాకినాడ
రాజమండ్రి నుంచి పిఠాపురం పర్యటనకు వెళ్తూ మార్గమధ్యంలో రామస్వామిపేట వద్ద ఏడీబీ రోడ్డు నిర్మాణం పనులని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. రోడ్డు నిర్మాణం ఎప్పుడు ప్రారంభం అయ్యింది. ఎంత వరకు పూర్తయ్యింది. ప్రస్తుతం పనులు ఎలా సాగుతున్నాయి తదితర వివరాలను తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి, ఇతర అధికారులను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు వెంట కాలి నడకన వెళ్తూ డ్రెయిన్ సౌకర్యం, నిర్మాణం పనుల్లో నాణ్యతను పరిశీలించారు.
ఇటీవల గేమ్ ఛేంజర్ ప్రీరిలీజ్ ఈవెంట్ సమయంలో వడిశలేరు వద్ద రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అభిమానుల ప్రాణాలు కోల్పోయిన ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాదానికిగల కారణాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ జిల్లా కలెక్టర్ శ్రీ షన్మోహన్ సగిలి, ఇతర ఉన్నతాధికారులు అయన తో పాటు ఉన్నారు.
- Advertisement -