పి  వెంకటాపురం గురుకుల పాఠశాలను సందర్శించిన పవన్ కళ్యాణ్

- Advertisement -

పి  వెంకటాపురం గురుకుల పాఠశాలను సందర్శించిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan visited P Venkatapuram Gurukula School

కాకినాడ
కాకినాడ జిల్లా పర్యటనకు వచ్చిన డిప్యూటీ సిఎం పవన్ కళ్యాన్ కాకినాడ రూరల్ మండలం పి. వేంకటాపురం గ్రామంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ బాలికల గురుకుల  పాఠశాల ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, అధికారులు, కూటమి నాయకులు పాల్గోన్నారు. పి.వెంకటాపురం బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులతో ఉప ముఖ్యమంత్రి  పవన్ కల్యాణ్ మాట్లాడుతూ. సీఎం చంద్రబాబునాయుడు చెప్పినట్లు భవిష్యత్తు మీది., 2047 నాటికి దేశాన్ని మీరే నడిపించాలని ప్రోత్సహించారు. గురుకులంలోనే ఎం.సెట్. శిక్షణ కేంద్రం ఏర్పాటుచేస్తే ఉపయోగంగా ఉంటుందని., ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. 15 రోజుల్లో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థినులకు అందుతున్న అల్పాహారం, భోజనంపై ఆరా తీశారు. గార్డ్ ఆఫ్ ఆనర్ నిర్వహించిన విద్యార్థినులు, ఉపాధ్యాయులను అభినందించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular