రెండవరోజు కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ వరుస భేటీలు

- Advertisement -

రెండవరోజు కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ వరుస భేటీలు
కాకినాడ
కాకినాడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండో రోజు శుక్రవారం పలు సమీక్షలు నిర్వహించారు. కాకినాడ నగరంలో డివిజన్లు వారీగా జనసేన కార్యకర్తలతో సమావేశం అయ్యారు. కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ ను ఓడించే దిశగా అడుగులు వేస్తున్నారు  పవన్. కాకినాడ నగరంపై ప్రత్యేక దృష్టి పెట్టి డివిజన్లు వారీగా సమీక్ష నిర్వహించి క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకున్నారు. గతంలో సర్పవరం బహిరంగ సభలో ద్వారంపూడిని  ఓడిస్తానని చెప్పిన పవన్ , పవన్ ఓడించేందుకు ఎంత దూరమైనా వెళ్తానని  ద్వారంపూ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ద్వారంపూడి టార్గెట్ గా కాకినాడ లో పవన్ క్షేత్రస్థాయిలో దృష్టి  పెట్టారు. శుక్రవారం నాడు సుమారు 15 డివిజన్లతో పూర్తిస్థాయిలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఒక డివిజన్ లో వివిధ వర్గాలకు సంబంధించిన సుమారు 20 మందితో అయన స్వయంగా మాట్లాడుతున్నారు. మీ వార్డులో పరిస్థితులు ఎలా ఉన్నాయి , సమస్యలు ఏమిటి , ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉంది , మీ సమస్యలను ఏ విధంగా అధిగమించాలి అనే అంశాలు అడిగి తెలుసుకుంటున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular