సత్వవరమే ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించండి.
రాష్ట్రంలోని ఇంటర్, డిగ్రీ షిజి, ఇంజనీరింగ్, వృత్తి విద్యా కళాశాలల ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలని న్యాయవాది, తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారుడు, న్యాయవాది, దయాల ఓంప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు.
ఇంటర్, డిగ్రీ, పిజి కళాశాలల్లో 14 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్
కోసం ఏటా రూ.7800 కోట్ల అవసరమని, వీటికోసం ప్రభుత్వం వీలైనంత త్వరగా నిధులు విడుదల చేయాలన్నారు.
గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం నిధులు చెల్లించకపోవడంతో అధ్యాపకులు, సిబ్బంది వేతనాలు, భవనాల అద్దె, నిర్వహణ చార్జీలు చెల్లించలేక కొన్ని కాలేజీలు మూతపడ్డాయన్నా రు.
ఫీజు రీయింబర్స్ మెంట్
నిధులను సక్రమంగా చెల్లించడంతోపాటు మరింత మెరుగ్గా అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో పొందుపరచిన విషయాన్ని ఈ సందర్భంగా ఓంప్రసాద్ గుర్తుచేశారు.
కళాశాల విద్యా సంవత్సరం ముగిసినా ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు మంజూరు కాలేదని, ఇప్పటికైనా ప్రభుత్వం విద్యార్థులను, కళాశాల యాజమాన్యాలను దృష్టిలో పెట్టుకొని సత్వరమే ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లిం చాలని ప్రభుత్వాన్ని కోరారు.
కళాశాలల ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లింపు విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీనుకెళ్లేందుకు తెలంగాణ బి.సి.సంక్షేమశాఖ, రవాణాశాఖా మాత్యులు పొన్నం ప్రభాకర్ కు త్వరలో వినతిపత్రాన్ని కూడా నమర్పించనున్నట్లు ఓంప్రసాద్ తెలిపారు.
దయాల ఓంప్రసాద్,
తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, న్యాయవాది, ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారుడు,
ఉమ్మడి కరీంనగర్ జిల్లా.




