- Advertisement -
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ముత్యపు పందిరి వాహన సేవ జరిగింది. వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారు బకాసురవధ అలంకరణలో కటాక్షించారు. ఉదయం స్వామివారికి సింహ వాహన సేవ జరిగింది. వాహనంపై శ్రీమలయప్పస్వామి యోగనరసింహస్వామి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. వాహన సేవలో పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, తితిదే ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సీవీఎస్‌వో నరసింహకిశోర్ పాల్గొన్నారు.

- Advertisement -



