వేసవి లోపు పెద్దపల్లి కునారం రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి
Peddapally Kunaram Railway Flyover Bridge before summer
జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
పెద్దపల్లి ప్రతినిధి:
రాబోయే వేసవి లోపు పెద్దపల్లి కూనారం రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి ఒక వైపు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పెద్దపల్లి కూనారం రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ 119 కోట్ల 50 లక్షల వ్యయంతో పెద్దపల్లి కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జి ప్రభుత్వం నిర్మిస్తుందని తెలిపారు. పెద్దపల్లి కూనారం ఆర్.ఓ.బీ బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన పెండింగ్ భూ సేకరణ డిమాండ్ నోటీస్ జనరేట్ చేసి ఆర్ అండ్ బి అధికారులకు అప్పగించాలని కలెక్టర్ సంబంధిత రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదలైన నేపథ్యం లో రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలని, వచ్చే సమ్మర్ సీజన్ లోపు కనీసం ఒకవైపు ఆర్.ఓ.బీ పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటు లోకి తీసుకుని రావాలని కలెక్టర్ ఆదేశించారు. రైల్వే ఓవర్ బ్రిడ్జికి సంబంధించిన సర్వీస్ రోడ్డు పనులు సమాంతరంగా జరగాలని, వీటిని సమ్మర్ నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బీ ఈఈ భావ్ సింగ్, తహసిల్దార్ రాజ్ కుమార్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.