- Advertisement -
గ్రామ సభల్లో స్వచ్చందంగా నిరసన తెలుపుతున్న ప్రజలు..మాజీ ఎమ్మెల్యే పెద్ది
People protesting voluntarily in the village councils.. Former MLA Peddi
గత ప్రభుత్వంలో వచ్చిన నిధులతోనే నియోజకవర్గ అభివృద్ధి…..
పోలీస్ లు నాజోలికి వస్తే రాజ్యాంగ పరంగా ముందుకు వెళ్తా….
నర్సంపేట
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చేయక పోవడంతో ప్రజలు స్వచ్చందంగా గ్రామసభల్లో నిరసనలు తెలుపుతున్నారని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. మంగళవారం నల్లబెల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెద్ది మాట్లాడుతూ,నిన్న నియోజకవర్గ పరిధిలో జరిగిన గ్రామసభలలో మేజారిటి స్థాయిలో ప్రజలు స్వచ్చందం గా నిరసనలు తెలిపారని అన్నారు.నల్లబెల్లి మండల కేంద్రంలో జరిగే గ్రామ సభకు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు ఎందుకు వచ్చారని విమర్శించాడు.నా రాజకీయ జీవితంలో మొదటిసారిగా ఇలాంటి రాజకీయాలు చూస్తున్నానని, నాస్వగ్రామంలో దుకాణాలు, షాపులు బంద్ చేసి వందలాదిమంది పోలీసుల మధ్య గ్రామ సభ నిర్వహించడం విడ్డురంగా ఉందని ఇద్దేవా చేశాడు.గత దసర పండగ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గొడవలు సృష్టించడం అందరికి తెలిసిన విషయమేనని అన్నారు.చెన్నారావుపేట మండలం అమీనాబాద్ పత్తినా యాక్ తండాలో జరిగిన గ్రామ సభలో కూడా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు పాల్గొని ప్రజాస్వామ్య నికి విరుద్ధంగా పనిచేశారని విమర్శించాడు. గ్రామ సభలోప్రజలు, మీడియా ప్రతినిధుల పట్ల ఎమ్మెల్యే ప్రవర్తించిన తీరు సరిగా లేదని అన్నారు.ఓ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రవర్తించిన తీరు ప్రజలు గమనిస్తున్నారని తెలుపుతూ,గ్రామ సభకు మండల హెడ్కోటర్లో పోలీసుల నిర్బంధం,కర్ఫ్యూ వాతావరణం కలిగించి గ్రామ సభ నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించాడు.గ్రామ సభలల్లో ప్రజలు పాల్గొనడం, ప్రశ్నించడం వారి హక్కని పోలీసులతో ప్రజలను అడ్డుకోవడం అప్రజాస్వామికమని అన్నారు.ఎన్నికల ముందు మీరు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారమే మీ హామీలను ప్రజలు అడుగుతున్నారని,100 రోజులలోనే 6 గ్యారంటీలు 420 హామీలు పూర్తి చేస్తామని చెప్పారు కదా 400 రోజులైనా ఎందుకు జరగడంలేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే గారు ఎక్కడ పర్యటించినా చుట్టు పోలీసులను కాపలాగా పెట్టుకొని తిరుగుతూ,సామాన్యులకు ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ లేకుండా చేస్తున్నాడని విమర్శించాడు.గత ప్రభుత్వం హయాంలో నియోజకవర్గానికి వందల కోట్ల నిధులు తీసుకువస్తే అన్ని నిధులను రద్దు చేసింది మీరు కాదా అని ప్రశ్నించాడు.లాభం వచ్చే పనులను మళ్ళి టెండర్లు వేసి లాభం రాని పనులను రద్దు చేశారన్నారు.14 నెలల కాలంలో నియోజకవర్గ పరిధిలో మీరు చేసిన అభివృద్ధి ఎక్కడుందో తెలుపలాన్నారు. మార్పంటే నల్లబెల్లి గ్రామ సభ నా, అంటూ మీ సొంత గ్రామంలో అధికారికంగా చాలా సార్లు గ్రామ సభలో పాల్గొన్న ఎప్పుడు ఇంత పోలీస్ బలగాలను చూడలేదని,నా సొంత గ్రామానికి ఎంత అభివృద్ధి జరిగిందో మీ గ్రామానికి కూడా అంతే అభివృద్ధి చేశానని అన్నారు.రైతులకు ఇంకా 49 కోట్ల బోనస్ రావాల్సి ఉందిని వాటిని వెంటనే రైతులకు అందించాలని డిమాండ్ చేశాడు.గ్రామ సభలు పెద్ద మాయ అంటూ స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇదో స్టంట్ గా అభివర్ణించ్చాడు.మీ ఆలోచన ఫలితంగా గా నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి ఇరవై ఎండ్లు వెనక్కి వెళుతుందని అన్నారు.వేల మంది పోలీసులు లేకుంటే తప్ప బయటకు రాలేని పరిస్థితి ఎమ్మెల్యే కు ఏర్పడిందని వ్యాంగంగా మాట్లాడారు.బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నిధులతో అభివృద్ధి చేస్తున్నారే తప్ప మరే అభివృద్ధి జరగడం లేదని విమర్శలు చేశాడు.
పోలీసులు నా జోలికి వస్తే రాజ్యాంగ పరంగా ముందుకు పోతా……పోలీస్ లు నాజోలికి వస్తే రాజ్యాంగ పరంగా, చట్ట పరంగా ముందుకు పోతానని పెద్ది పోలీస్ లను ఉద్దెశించి మాట్లాడాడు.మేము నిజంగా నిరసన తెలుపాలంటే మీరు తట్టుకోగలరా అంటూ,నల్లబెల్లి గ్రామ సభ ఏ ఉద్దేశంతో ప్రశాంత వాతావరణం లో జరగకుండా అడుగున పోలీసులు నిర్బంధం చేయడం ఏంటని ప్రశ్నిచ్చాడు.ఈ కార్యక్రమంలోమండల పార్టీ అధ్యక్షుడు పిఎసిఎస్ చైర్మన్ మాజీ ఎంపీపీలు మండల పార్టీ నాయకులు క్లస్టర్ బాధ్యులు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు గ్రామ పార్టీ అధ్యక్షులు గ్రామపార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నా
- Advertisement -



