- Advertisement -
గ్రామ రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి…తహసిల్దార్ రమాదేవి
People should take advantage of village revenue conferences...Tehsildar Ramadevi
తుగ్గలి
మండల వ్యాప్తంగా డిసెంబర్ 6 నుండి 28వ తేదీ వరకు జరుగు గ్రామ రెవెన్యూ సదస్సులను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తుగ్గలి మండల తహసిల్దార్ రమాదేవి తెలియజేశారు.బుధవారం రోజున స్థానిక తహసిల్దార్ కార్యాలయం నందు జిల్లా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులతో రెవెన్యూ గ్రామ సదస్సుల నిర్వహణ పై సమావేశాన్ని నిర్వహించారు.ఈ సభలో భాగంగా తహసిల్దార్ మాట్లాడుతూ ఈ రెవెన్యూ గ్రామసభలో రైతుల నుండి వచ్చే భూ సమస్యలకు సంబంధించి అర్జీలను స్వీకరించి,భూ సమస్యల పరిష్కారం కొరకు అధికారులు కృషి చేయాలని ఆమె అధికారులకు తెలియజేశారు.6వ తేదీన బొందిమడుగుల గ్రామం నందు,10వ తేదీన ముక్కెళ్ల గ్రామం నందు,11వ తేదీన చెన్నంపల్లి గ్రామం నందు,13వ తేదీన పెండేకల్ గ్రామం నందు,18వ తేదీన కడమకుంట్ల గ్రామం నందు,19వ తేదీన పగిడిరాయి గ్రామం నందు,20వ తేదీన జొన్నగిరి గ్రామం నందు,21వ తేదీన ఎర్రగుడి గ్రామం నందు,24 వ తేదీన లింగనేనిదొడ్డి గ్రామం నందు,26 వ తేదీన తుగ్గలి గ్రామం నందు,27వ తేదీన రాతన గ్రామం నందు,28వ తేదీన ఎద్దుల దొడ్డి గ్రామం నందు రెవెన్యూ గ్రామ సదస్సులను నిర్వహిస్తున్నట్లు తహసిల్దార్ తెలియజేశారు.కావున ప్రజలు గ్రామ రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకొని భూ సమస్యలను పరిష్కారం చేసుకోవాలని తహసిల్దార్ రమాదేవి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ నాగరాజు,మండల సర్వేయర్ సుధాకర్, మండల వీఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -