మహిళా ఉపాధ్యాయ దినోత్సవం గా ప్రకటించడం పట్ల ప్రజా సంఘాల హర్షం
People's organizations are happy to declare it as Women's Teacher's Day
మంథని
చదువుల తల్లి సావిత్రి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం గా ప్రకటించడం పట్ల మంథని కి చెందిన ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
శుక్రవారం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మంథని ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అనేక సంవత్సరాలుగా డిమాండ్ చేయడం జరిగిందని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవం గా స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నామని అన్నారు అదేవిధంగా మంథనిలో నిరుపయోగంగా ఉన్న గ్రంథాలయాన్ని అందరికీ అందుబాటులో విధంగా తీసుకువచ్చి విద్యార్థులకు నిరుద్యోగ యువతకు మంథని ప్రజానీకానికి ఉపయోగపడేలా మరియు మంథని కేంద్రంలో సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారిని కోరారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ల సందీప్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఏల్పుల సురేష్, కెవిపిఎస్ మంథని లింగయ్య, ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు బందెల రాజ్ కుమార్ లు పాల్గొన్నారు.