- Advertisement -
పేకాట స్థావరంపై పోలీసులు దాడి
Police attack on poker base
9 మంది వ్యక్తులు అరెస్టు,
రూ.72,100/- నగదు సీజ్
నరసరావుపేట,
పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు గురువారం మధ్యాహ్నం 12.50నిమిషాలకు నరసరావు పేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగంగుంట్ల గ్రామం లోని లక్ష్మి విజయ పార్కింగ్ రూంలో పేకాట ఆడుతున్న వారిని నరసరావు పేట రూరల్ ఎస్సై కిషోర్ తమ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. పేకాట నిర్వహిస్తున్న 9మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి 72,100/ నగదు స్వాధీనం చేసుకున్నారు. నరసరావు పేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎస్పీ ఆదేశాల మేరకు చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
- Advertisement -