పొలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు..
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కర్ణపేటలోని రైతు వేదికలో గిరిజన గ్రామాల ప్రజలకు రామగుండం కమిషనర్ పరిధిలోని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు..ఈ మెడికల్ క్యాంపు లో మండలం లోని చుట్టూ ప్రక్కన గల 31 గిరిజన గ్రామాల కు చెందిన ప్రజలకు వివిధ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణి చేసారు.
అదేవిధంగా గిరిజన గ్రామాలలోని ప్రజలకు మంచిర్యాల రవాణా శాఖ అధికారుల ఆధ్వర్యంలో లైసెన్స్ జారీ చెయ్యడానికి స్టాల్ ఏర్పాటు చెయ్యడం జరిగింది. లైసెన్స్ పొందడానికి పలు సూచనలు చేశారు. బ్యాంక్ అధికారులచే అకౌంట్ ఓపెన్ చెయ్యడానికి స్టాల్ ఏర్పాటు చేసి సైబర్ క్రైమ్ గురించి అవగాహనా కల్పించారు. ఈ క్యాంపు లో పాల్గొన్న రామగుండం సీపీ రామరాజేశ్వరి మాట్లాడుతు గిరిజన గ్రామాల్లోని ప్రజలు ఆర్టీఏ అధికారులు ఏర్పాటు చేసిన ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకొని లైసెన్స్ పొందాలని కోరారు. గిరిజనలు దూర ప్రాంతాల్లో ఉన్న హాస్పిటల్స్ కు వెళ్లి పరీక్షలు చేసుకోలేరు కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపు లో అన్ని రకాల పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశంను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇక్కడ ఉన్న ప్రతి గిరిజన కుటుంబానికి దుప్పట్లు పంపిని చేసి,గిరిజనుల కు 350 మంది కి లర్ణింగ్ లైసెన్స్ అందజేశారు…ఈ కార్యక్రమం లో డీసీపీ సుదీర్,ఏసీపీ తిరుపతిరెడ్డి గ్రామ సర్పంచ్, ప్రజలు పాల్గొన్నారు.