తెలంగాణ వ్యాప్తంగా మార్చి 3 నుంచి పోలియో చుక్కలు
రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 3 నుంచి ఫల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం కానున్నది. వరుసగా మూడు రోజుల పాటు మార్చి 5 వరకు స్పెషల్ డ్రైవ్‌లు కొనసాగనున్నాయి
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్ వాడీ సెంటర్లు, గ్రామ పంచాయితీ కార్యాలయాలు, సర్కారీ స్కూళ్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 5 ఏళ్ల లోపు పిల్లలందరికీ డ్రాప్స్ వేయనున్నారు
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 లక్షల మందికి పైగా పోలియో డ్రాప్స్ వేయనున్నట్లు అంచనా. అయితే వైద్యారోగ్యశాఖ పల్స్ పోలియో ప్రిపరేషన్‌పై ఇప్పటి వరకు ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. కనీసం టీమ్ లకు సలహాలు, సూచనలు కూడా ఇవ్వలేదని తెలుస్తోన్నది. ఇక ఫిబ్రవరి 29న 1532 మంది జన్మించినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. లీప్ ఇయర్ డే న పుట్టినందున ఆయా పిల్లలకు నాలుగేళ్లకోసారి బర్త్ డే రానున్నది