Monday, December 23, 2024

తెలంగాణ రాష్ట్రానికి కాబోయే మంత్రుల రాజకీయ నేపథ్యం…

- Advertisement -
political-background-of-future-ministers-of-telangana-state
political-background-of-future-ministers-of-telangana-state

దామోదర రాజనర్సింహ..

జననం 5 డిసెంబరు 1958

తల్లిదండ్రులు: దివంగత మంత్రి రాజనర్సింహ–జానాబాయి

1989లో తండ్రి మాజీ మరణంతో రాజకీయాల్లోకి ప్రవేశం..

1989లో అందోల్​ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేగా తొలిసారి గెలుపు..

2004 లో అందోల్ నుంచి మరోసారి విజయం

2006లో వైఎస్‌ఆర్‌ పాలనలో ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా

2009లో వైఎస్‌ఆర్, రోశయ్య హయాంలో మంత్రి వర్గంలో చోటు

2011 జూన్‌ 10వ తేదీన డిప్యూటీ సీఎంగా నియమాకం…

ఆ తర్వాత 2014, 2018 ఎన్నికల్లో ఓటమి

ఆగస్టు 20, 2023న జాతీయ కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ శాశ్వత ఆహ్వనిత సభ్యుడిగా నియమాకం…

2023 లో అందోల్ నుంచి అసెంబ్లీకి ఎన్నిక

భట్టి విక్రమార్క..

1961, జూన్‌ 15న మల్లు భట్టి విక్రమార్క జననం.

విద్యాభ్యాసంః హైదరాబాద్ నిజాం కాలేజ్‌లో డిగ్రీ, HCUలో పీజీ.

2009లో తొలిసారి మధిర నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నిక

2009-11 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్‌ విప్‌‌గా బాధ్యతలు

2011-2014 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌

2009 – 2023 మధ్య 4సార్లు మధిరలో నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం

గత శాసనసభలో కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ లీడర్‌గా బాధ్యతలు

దుద్దిళ్ల శ్రీధర్ బాబు

జననం 9 మార్చి 1969

ధన్వాడ గ్రామం, కాటారం మండలం, జయశంకర్ జిల్లా, తెలంగాణ

తల్లిదండ్రులు దుద్దిల్ల శ్రీపాద రావు, జయమ్మ

జీవిత భాగస్వామి శైలజ రామయ్యర్‌ (ఐఏఎస్‌ అధికారిణి)

ఢిల్లీ విశ్వవిద్యాలయంలో న్యాయవాద విద్యను అభ్యసించారు.

1998లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్.

1999లో తండ్రి హత్యానంతరం రాజకీయాల్లో అడుగుపెట్టిన శ్రీధర్‌బాబు

1999 శాసనసభ ఎన్నికల్లో మంథని నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ తరపున విజయం

1999 కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు

1999 – 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మంథని నియోజకవర్గం శాసనసభ్యునిగా ఎన్నిక

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బాధ్యతలు.

ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

1962 జూన్‌ 20న జననం

బీఎస్సీ గ్రాడ్యుయేట్‌, ఇండియన్‌ ఫోర్స్‌ మాజీ పైలట్‌

1999-2009 మధ్య కోదాడ ఎమ్మెల్యే

2014దాకా ఉమ్మడి ఏపీ గృహనిర్మాణశాఖ మంత్రి

2015-2021 మధ్య తెలంగాణ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు

2009-2018 మధ్య హుజుర్‌నగర్‌ ఎమ్మెల్యే

2019 సాధారణ ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా గెలుపు

2023లో మరోసారి హుజుర్‌ నగర్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక

ధనసరి అనసూయ ( సీతక్క )

1971 జూలై 9న జననం

1988లో 10వ తరగతిలోనే నక్సల్స్‌ పార్టీలో చేరిక

జన నాట్యమండలి ద్వారా ఆదివాసీల సమస్యలపై పోరాటం

రెండు దశాబ్దాల పాటు కామ్రేడ్‌గా వివిధ హోదాల్లో విధులు

ఎన్టీఆర్‌ పిలుపుతో జనజీవన స్రవంతిలోకి రాక

2001లో న్యాయవాదిగా ప్రాక్టీస్

2004లో ములుగు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ, తప్పని ఓటమి

2009లో తొలిసారి ములుగు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నిక

2014లో ఓటమి, అనంతరం కాంగ్రెస్‌లో చేరిక

2018 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ములుగు నుంచి గెలుపు.

2023 ఎన్నికల్లో ములుగు నియోజకవర్గం నుంచి విజయం

కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి

1963 మే 23న జననం

యువజన కాంగ్రెస్‌ నాయకుడిగా రాజకీయ అరంగేట్రం

2009 – 2014 మధ్య నల్గొండ ఎమ్మెల్యేగా బాధ్యతలు

వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్‌ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో చోటు

2011లో తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా

2018లో నల్గొండ అసెంబ్లీ స్థానంలో ఓటమి

2019లో భువనగిరి పార్లమెంటు సభ్యులుగా గెలుపు

2023లో మరోసారి నల్గొండ నుంచి అసెంబ్లీకి ఎన్నిక

పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి

2014లో ఖమ్మం నుంచి YSRCP తరపున ఎంపీగా విజయం

2014 తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరిక

2023లో బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌ పార్టీలో జాయిన్

2023లో పాలేరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నిక

పొన్నం ప్రభాకర్‌ గౌడ్

1967 మే 8న జననం

విద్యార్థి నాయకుడిగా రాజకీయం అరంగ్రేటం

1987 – 89 వరకు NSUI కరీంనగర్ జిల్లా కార్యదర్శి

1989 – 91 వరకు NSUI ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి

1999- 2002 వరకు NSUI ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు

2002 – 2003 మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి

2009లో కరీంనగర్‌ పార్లమెంట్‌ సభ్యుడిగా గెలుపు

2014లో కరీంనగర్‌ ఎంపీ స్థానంలో ఓటమి

2018 అసెంబ్లీఎన్నికల్లో కరీంనగర్‌ నుంచి ఓటమి

2023లో హుస్నాబాద్‌ నుంచి అసెంబ్లీకి ఎన్నిక

కొండా సురేఖ

1965 ఆగస్టు 19న జననం

1995లో మండల పరిషత్‌గా ఎన్నిక

1999, 2004 ఎన్నికల్లో శాయంపేట ఎమ్మెల్యే ఎన్నిక

2009లో పరకాల నియోజకవర్గం నుంచి గెలుపు, వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి కేబినెట్‌లో మంత్రి

2011లో కాంగ్రెస్‌కు రాజీనామా

2014లో బీఆర్‌ఎస్‌ పార్టీ తరుఫున వరంగల్‌ తూర్పు నియోజకవర్గం నుంచి గెలుపు

2018లో మరోసారి కాంగ్రెస్‌లో చేరిక

2023లో వరంగల్‌ తూర్పు నియోజకవర్గం నుంచి విజయం

జూపల్లి కృష్ణారావు..

1955, ఆగస్టు 10న జననం

1999 – 2014 మధ్య కొల్లాపూర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యేగా వరుస విజయాలు

వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా అవకాశం

2011లో కాంగ్రెస్ పార్టీ వీడి బీఆర్‌ఎస్‌లో చేరిక

2014లో తెలంగాణ తొలి కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు

2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి ఓటమి

2022లో బీఆర్ఎస్ పార్టీ వీడి మళ్లీ కాంగ్రెస్‌లో చేరిక

2023లో కొల్లాపూర్‌ నుంచి మరోసారి అసెంబ్లీకి ఎన్నిక

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్