33.3 C
New York
Tuesday, July 16, 2024

ప్రజావాణి ఫిర్యాదులను వెంటవెంటనే పరిష్కరించాలి

- Advertisement -

ప్రజావాణి ఫిర్యాదులను వెంటవెంటనే పరిష్కరించాలి
పెండింగ్ పెట్టవద్దు..
జిల్లా కలెక్టర్ పమేలా
ప్రజావాణి ఫిర్యాదుల స్వీకరణ
కరీంనగర్
ప్రజావాణి ఫిర్యాదులను అధికారులు వెంట వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. ఎంతో దూరం నుంచి సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తూ వస్తున్న బాధితులకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి ప్రజావాణి ఫిర్యాదులను ప్రజల నుంచి స్వీకరించారు. స్వయంగా ఒక్కొక్కరీ ఫిర్యాదులను పరిశీలించి అప్పటికప్పుడే అధికారులకు పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి లో వచ్చిన ప్రతి ఫిర్యాదును అధికా రులు పరిష్కరించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని పెండింగ్లో పెట్టవద్దని, వార వారం ఫిర్యాదులు పరిష్కరిం చుకుంటూ ముందుకు సాగాలని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజావాణిలో 396 ఫిర్యాదులు వచ్చాయి. కరీంనగర్ మున్సిపల్ కార్యాలయానికి 59, ఆర్డిఓ కార్యాలయానికి 23, సీపీ  కార్యాలయానికి 13, డిపిఓ కార్యాలయానికి 16, చిగురుమామిడి తహసిల్దార్ కార్యాలయానికి 24, కరీంనగర్ రూరల్ తహసిల్దార్ కార్యాలయానికి 19, కొత్తపెల్లి తహసిల్దార్ కార్యాలయానికి 17, హుజురాబాద్ కార్యాలయానికి 14, వారధి సొసైటీ కార్యాలయానికి 11 దరఖాస్తులు వచ్చాయి. వీటి పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమాన్నిసద్వినియోగం చేసుకోవాలి.ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల నుంచి మొదలు రైతులు, గృహిణులు, యువకులు ఇలా ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. సొంతంగా చేసిన ఆవిష్కరణలను
పంపించాలని సూచించారు.ఆవిష్కరణలకు సంబంధించిన నాలుగు ఫోటోలు,100 పదాలు, రెండు నిమిషాలు నిడివి కలిగిన వీడియో, ఆవిష్కర్త పేరు, సెల్ ఫోన్ నంబరు, ప్రస్తుత వృత్తి పూర్తి వివరాలు  9100678543 నంబర్ వాట్సప్ కు పంపించాలని సూచించారు. ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 3 వ తేదీలోగా పంపించాలని పేర్కొన్నారు. వచ్చిన ఆవిష్కరణల్లో ఉత్తమమైనవి ఎంపిక చేసి స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రదర్శిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు.
అంధ విద్యార్థులకుల్యాప్ టాప్ ల  అందజేత
తెలంగాణ దివ్యాంగుల కార్పొరేషన్ నుంచి మంజూరైన లాప్ టాప్ లను ముగ్గురు అంధ విద్యార్థులకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అందజేశారు. మౌనిక, హరీష్, సృజన్ రెడ్డి అనే అంధ విద్యార్థులకు  జిల్లా కలెక్టర్ లాప్టాప్ లను అందజేశారు. సకలాంగులకు దీటుగా దివ్యాంగులు చదువుల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.ఆయా కార్యక్రమాల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీ కిరణ్, డిఆర్ఓ పవన్ కుమార్, హుజురాబాద్ ఆర్డీవో రమేష్ బాబు ఏవో సుధాకర్, డీఈఓ జనార్దన్ రావు, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, జిల్లా సైన్స్ అధికారి జైపాల్ రెడ్డి, ఈడియం శ్రీరామ్ శ్రీనివాస్ రెడ్డి, ఇంటింటా ఇన్నోవేటర్ కోఆర్డినేటర్ మణిదీప్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!