పర్యావరణం కాపాడడం  మన అందరి బాధ్యత

- Advertisement -

పర్యావరణం కాపాడడం  మన అందరి బాధ్యత

Protecting the environment is the responsibility of all of us

హైదరాబాద్
వన మహోత్సవం -2024 కార్యక్రమంలో భాగంగా బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ వెనుక భాగం లో గల లింక్ రోడ్డు  ప్రాంతంలో పెద్దయెత్తున చేపట్టే ప్లాంటేషన్ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మొక్కలు

నాటారు.ఈ కార్యక్రమంలో  జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మి, కార్పొరేటర్ సీఎన్ రెడ్డీ, జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి ,అటవీ శాఖ  అధికారులు,ఇతర అధికారులు పాల్గోన్నారు.
మంత్రి  పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం సంవత్సరం పూర్తి చేసుకుంది. యావత్ తెలంగాణ ప్రజలు ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ప్రతి పౌరుడు, విద్యార్థులు, ఉద్యోగులు అందరూ

ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని సంకల్పం తీసుకోవాలి. రాబోయే కాలంలో హైదరాబాద్ ను కాలుష్యం నుండి రక్షించే బాధ్యతను తీసుకోవాలని అన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యంతో పాఠశాలలు బంద్ చేసే పరిస్థితి ఏర్పడింది ..వలస పోయి వేరే దగ్గర బతుకే పరిస్థితి ఉంది. హైదరాబాద్ అలాంటి పరిస్థితి రాకుండా ఉండడానికి ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది.

కాలుష్యాన్ని నివారించడానికి వాహనాలకు ఈవీ పాలసీ తీసుకొచ్చింది. హైదరాబాద్ నగరంలో అన్ని వాహనాలు ఆర్టీసీ బస్సులు ఇతర వాహనాలు ఆటోలు ఎలక్ట్రిక్ వాహనాలుగా మారుస్తాం. కాల పరిమితి పూర్తి

చేసుకున్న జీహెచ్ఎంసీ వాడే వాహనాలు స్క్రాప్ కి ఇచ్చి ఈవి వెహికిల్ గా మారుస్తాం. 15 సంవత్సరాలు దాటిన వాహనాలు స్క్రాప్ పాలసీ తీసుకొచ్చాం. చెట్లు చాలా అవసరం సామాజిక బాధ్యత గా రోజు వారి

కార్యక్రమాల్లో మొక్కలు నాటడం పెంచడం చేసుకోవాలి. ప్రజలందరికీ విజ్ఞప్తి వాతావరణాన్ని కాపాడడానికి..పర్యావరణం కాపాడడం  మన అందరి బాధ్యత అని అన్నారు. .

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular