పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు : మంత్రి కొల్లు
Pulivendula MLA Jaganmohan Reddy speaks shamelessly: Minister Kollu
గన్నవరం :
వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే పులివెందుల ఎమ్మెల్యే జగనరెడ్డి ప్రజలకు సాయం చేయకపోగా సిగ్గులేకుండా అబద్దాలు ప్రచారం చేస్తున్నారని జిల్లా మంత్రి కొల్లు రవీంద్ర జగన్ తీరు పై మండిపడ్డారు. గన్నవరం నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాలయిన జక్కుల నెక్కలం , ముస్తాబాద, సావారిగూడెం తదితర ప్రాంతాల్లో మంత్రి కొల్లు రవీంద్ర గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తొ కలిసి విస్తృతంగా పర్యటించారు. పడవల పైనా, ట్రాక్టర్ లలో ప్రతి గడపకు వెళ్లి ఆహారం , త్రాగునీరు పంపిణీ పై బాధితుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎవరు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. త్వరలోనే వరద ప్రభావిత ప్రాంతాలు సాధారణ స్థితికి వస్తాయని భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ గత ఐదు రోజులుగా వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద వచ్చిన నాటి నుండి విజయవాడలో బస్సులో వుంటూ సహాయక చర్యలు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. బుడమేరు కు పడిన గండ్ల ను పూడ్చే బాధ్యత లో మంత్రులు లోకేష్ , నిమ్మల ఉన్నారన్నారు . బుడమేరు కు సంబంధించి పలు చోట్ల గండ్లు పడ్డాయని రేపటి కి ఈ గండ్లు పుడ్చే పనులు పూర్తి అవుతాయని స్పష్టం చేశారు. వరద భాదితులు ప్రతి ఒక్కరికీ ఆహారం, మంచినీరు, మెడిసిన్స్ అందచేస్తున్నామని వెల్లడించారు. గత 40 ఏళ్లలో ఎప్పుడు చూడని విధంగా విపత్తు వచ్చిందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ తో హెలికాఫ్టర్లు,ఎన్టీఆర్ఎఫ్ బృందాలు విజయవాడ కు వచ్చాయని తొందరలోనే సాధారణ స్థితికి వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన రైతులను, వరద బాధితులను కూటమి ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. బాధితులకు ఇంత సహాయం చేస్తుంటే పులివెందుల ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిచ్చి పట్టినట్లు మాట్లాడుతున్నాడని మానవత్వం లేకుండా విమర్శలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. ప్రజలకు భరోసా ఇవ్వాల్సింది పోయి చెత్త రాజకీయాలు చేస్తున్నాడని లండన్ కి వెళ్తూ విజయవాడ వచ్చి రాజకీయాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఆయనను చిత్కరించుకుంటున్నారని అయినా సిగ్గు లేకుండా గేట్లు ఎత్తేశారు అంటూ మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. మీరు గానీ మీ నాయకులు గాను వరద బాధితులకు ఒక్క ముద్ద భోజనం పెట్టరా అని నిలదీశారు. చీప్ రాజకీయాలు చేసే వ్యక్తులను ప్రజలే తరిమి తరిమి కొడతారని ఇప్పటికైనా జగన్ మోహన్ రెడ్డికి సిగ్గు తెచ్చుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర హితవు పలికారు.