గురువారంతెరుచుకోనున్న పూరీ జగన్నాధుని రహస్య గది

- Advertisement -

గురువారంతెరుచుకోనున్న పూరీ జగన్నాధుని రహస్య గది
భువనేశ్వర్

Puri Jagannath’s secret room to be opened on Thursday

ఒడిశాలోని పూరీ జగన్నా ధుని  శ్రీ క్షేత్రరత్న భాండా గారం రహస్య గది తలుపు లు గురువారం తెరుచుకోను న్నాయి.  ఇందుకు గురువారం  ఉదయం 9.51 నుంచి 12.15 గంటల వరకు శుభముహూర్తంగా

నిర్ణయించారు. దీంతో దేశమంతా ఇప్పుడు ఆసక్తికరంగా చూస్తోంది. శ్రీక్షేత్ర కార్యాలయంలో మంగళవారం భాండాగారం అధ్యయన సంఘం అధ్యక్షు డు జస్టిస్ బిశ్వనాథ్ రథ్ నేతృత్వంలో నిర్వహించిన సమావేశంలో ఈ

మేరకు నిర్ణయించారు.  సమావేశం అనంతరం జస్టిస్ రథ్, ఆలయ పాలనాధికారి అరవింద పాఢి విలేకరులతో మాట్లాడుతూ ‘ఈ నెల 14న భాండాగారంలోని తొలి రెండు గదుల్లో ఉన్న పురుషోత్తముని సంపద బయటకు

తీసి తాత్కాలిక స్ట్రాంగ్రూంకు తరలించ మన్నారు..

ఇదంతా వీడియోగ్రఫీ చేయించాం. ఈనెల 18న రహస్య గదిని తెరిచి, అందులోని సంపదను మరో తాత్కాలిక స్ట్రాంగ్రూంలో భద్రపరుస్తాం. అనంతరం ఈ భాండాగారాన్ని పురావ స్తు శాఖకు మరమ్మతుల నిమిత్తం

అప్పగిస్తామ న్నారు.  పనులు పూర్తయ్యాక సంప దనంతా మళ్లీ రహస్య గదికి తెచ్చి, ఆభరణాల లెక్కింపు చేపడతామ’ని వెల్లడించా రు.రహస్య గది తెరుస్తున్న కారణంగా శ్రీక్షేత్రంలోకి గురువారం ఉదయం నుంచి

భక్తుల ప్రవేశాన్ని నిలిపి వేసినట్లు ఆలయ పాలక మండలి ప్రకటించింది..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular