తొమ్మిదవ తరగతిలోనే ర్యాగింగ్…!

- Advertisement -

బీసీ హాస్టల్ లో ర్యాగింగ్

బాలిక జుత్తు కత్తిరించిన క్లాస్ మెట్స్

చంద్రగిరి:  చంద్రగిరి ప్రభుత్వ సమీకృత  బాలికల హాస్టల్ లో  ర్యాగింగ్ భూతం పడగ విప్పింది. తొమ్మిదవ తరగతి చదువుతున్నవిద్యార్థిని  జుట్టు ను పక్క నే వున్న బాయ్స్  హాస్టల్ విద్యార్థులు కత్తిరించి  అమానుషంగా ప్రవర్తించారు.

Raging in ninth grade...!
Raging in ninth grade…!

చంద్రగిరి  ప్రభుత్వ బాలికల హాస్టల్ పక్కనే వున్న బాయ్స్ హాస్టల్ లోని  కొందరు పోకిరీ విద్యార్థులు సభ్య  సమాజం తల దించుకునేలా ప్రవర్తించారు. బాధిత బాలికను మానసికంగా వేదించారు. ఈ సమీకృత వసతి గృహం అనేక వివాదాలకు నిలయంగా మారింది.

గతం లో ఈ హాస్టల్ లో మత్తు పదార్థాలు కూడా విద్యార్థులు వద్ద దొరికినట్టు  సమాచారం. హాస్టల్ లో ఉంటున్న కొదరు విద్యార్థులు గ్యాంగ్ లు గా ఏర్పడి ఇతర విద్యార్ధినుల పట్ల  అసభ్యకరంగా ప్రవర్తించడం బట్టలు విప్పమని బెదిరించడం, కాళ్ళు పట్టమనడం వంటి చేష్టలతో హాస్టల్లో ఉంటున్న విద్యార్థినీ విద్యార్థులను భయభ్రాంతులను గురి చేస్తున్నట్టు సమాచారం.  ఇప్పటికైనా పోలీసు వారు ఇటువంటి అసాంఘిక చర్యలకు పాల్పడే విద్యార్థుల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థినీ, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు…

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular