Tuesday, May 12, 2026

టిపిటిఎల్ఏ అధ్యక్షుడి గా రహమాన్ భారి విజయం

- Advertisement -

టిపిటిఎల్ఏ అధ్యక్షుడి గా రహమాన్ భారి విజయం

Rahman's huge success as the president of TPTLA

-భారీ మెజారిటీతో గెలిపించిన ఉపాధ్యాయ బృందానికి కృతజ్ఞతలు.

– మీకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా పని చేస్తా.

– టిపిటిఎల్ఏ ప్రెసిడెంట్ రహమాన్

జమ్మికుంట

తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ అసోసియేషన్( టిపిటిఎల్ఏ ) అధ్యక్షునిగా ఆదివారం జమ్మికుంట లోటస్ పాండ్ స్కూల్లో జరిగిన ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థులు పోటీ పడగా మొత్తం ఓట్లు 479కి కాను 433 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా ఇందులో రహమాన్ కి 233 ఓట్లు, స్వర్ణలతకి 102 ఓట్లు, జగన్ కి 85 ఓట్లు వచ్చాయి. మొహమ్మద్ రహమాన్ తమ సమీప అభ్యర్థి పైన 131 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. ఈ ఎలక్షన్ కి ఎన్నికల అధికారి గా డాక్టర్ పుల్లూరి సంపత్ రావు ,కొండ విజయ్,చుక్క భాస్కర్, నల్ల శ్రీనివాస్ రెడ్డి, చింతం రాజేందర్, మేకల శ్రీనివాస్ యాదవ్ లు వ్యవహారించారు. ఎన్నికల్లో జమ్మికుంట పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్న ప్రైవేటు ఉపాధ్యాయులు లెక్చరర్ అందరూ పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గెలుపొందిన రహమాన్ ని కౌన్సిలర్ శ్రీపతి నరేష్, కార్మిక సంఘ నాయకుడు  సామ్రాజ్యం, లు అభినందించారు.ఈ సందర్భంగా అధ్యక్షునిగా గెలుపొందిన రహమాన్ మాట్లాడుతూ నన్ను నమ్మి భారీ మెజారిటీతో గెలిపించిన నా టిపిటిఎల్ఎ కుటుంబ సభ్యులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్న, ఎన్నికల్లో నేను మీకు ఇచ్చిన వాగ్దానాలను తప్పకుండా నెరవేర్చి సంఘ అభివృద్ధి కోసం సభ్యుల సంక్షేమం కోసం పనిచేస్తానని, నన్ను గెలిపించిన మిత్రులు శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్