రాహుల్ గాంధీకి ఈ దేశంలో ఉండే అర్హత లేదు

- Advertisement -

రాహుల్ గాంధీకి ఈ దేశంలో ఉండే అర్హత లేదు

Rahul Gandhi does not deserve to be in this country

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు
రంగారెడ్డి సెప్టెంబర్ 11
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.  విదేశాల్లో పర్యటిస్తూ భారత్ ను కించపర్చడమే కాకుండా ఎన్నికల వ్యవస్థను విమర్శిస్తున్న రాహుల్ గాంధీకి ఈ దేశంలో ఉండే అర్హత లేదని మండిపడ్డారు. ‘‘మిస్టర్ రాహుల్ గాంధీ… క్విట్ ఇండియా’’ అని నినదించారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయని చెప్పిన బండి సంజయ్… అందరూ కలిసి పోటీ చేసినా ఈసారి  జీహెచ్ఎంసీపై కాషాయ జెండాను ఎగరేసి తీరుతామని, మేయర్ పదవిని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ‘‘రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేస్తడనుకున్న. కానీ రేవంత్ తో సాధ్యం కావడం లేదు. ఎందుకంటే కేసీఆర్ కు కాంగ్రెస్ లో ఎవరిని పట్టుకుంటే పనైతదో తెలుసు. అందుకే ఢిల్లీ పోయి కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడుకుని వచ్చిండు… అందుకే కేసీఆర్ కుటుంబం జోలికి రేవంత్ రెడ్డి వెళ్లడం లేదు. అదే బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే కేసీఆర్ కుటుంబం అంతు చూసేటోళ్లం. అంకుశం సినిమాలో రాంరెడ్డిని ఎట్లా గుంజుకుపోయి జైల్లో వేశారో… అట్లనే కేసీఆర్ కుటుంబాన్ని గుంజుకుపోయి జైల్లో వేసేటోళ్లం. ఎందుకంటే కేసీఆర్ అన్ని అరాచకాలు చేసిండు.’’అని పేర్కొన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి ఎస్సార్ కన్వెన్షన్ హాలులో రంగారెడ్డి అర్బన్ జిల్లా ఆధ్వర్యంలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి బండి సంజయ్ తోపాటు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి, కూన రవి కుమార్ తదితరులు హాజరయ్యారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular