- Advertisement -
శ్రీవారి లడ్డూ కల్తీపై స్పందించిన రాహుల్ గాంధీ.
Rahul Gandhi reacts on Srivari Laddu adulteration.హైదరాబాద్
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కలుషిత నెయ్యి వాడుతున్నట్లు వస్తున్న వార్తలపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. శ్రీవారి ప్రసాదం అపవిత్రమైందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. బాలాజీ భారత్పాటు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది పూజించే దేవుడు. లడ్డూ కల్తీ ప్రతి భక్తుడినీ బాధపెడుతుంది. ఈవిషయాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. దేశంలో పుణ్యక్షేత్రాల పవిత్రతను కాపాడాలి అని ఎక్సు వేదికగా పేర్కొన్నారు.
- Advertisement -




