హత్రాస్‌ను తొక్కిసలాట మృతుల కుటుంబాలను పరామర్శించిన రాహుల్ గాంధీ
అలీగఢ్ జూలై 5
లోక్‌సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ శుక్రవారం హత్రాస్‌ను సందర్శించి, తొక్కిసలాట మృతుల కుటుంబాలను పరామర్శించారు. మతపరమైన కార్యక్రమానికి తగిన పోలీసు ఏర్పాట్లు చేయలేదని, ఇదే తొక్కిసలాటకు దారితీసిందని మృతుల బంధువులు చెప్పారని ఆయన తెలిపారు.ఈ విషాదాన్ని రాజకీయం చేయదలచుకోలేదని రాహుల్ గాంధీ అన్నారు. కాగా మృతుల కుటుంబాలకు మరింత పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.“ఇది బాధాకరమైన సంఘటన. చాలా మంది మరణించారు. నేను ఈ విషయాన్ని రాజకీయ కోణం నుండి చెప్పదలచుకోలేదు, కానీ పరిపాలనలో లోపాలు ఉన్నాయి, ముఖ్యమైన విషయం ఏమిటంటే… వారు పేదవారు కాబట్టి గరిష్ట పరిహారం ఇవ్వాలి. నష్టపరిహారం విషయంలో జాప్యం జరిగితే ఎవరికీ ప్రయోజనం ఉండదని యూపి సీఎం యోగి ఆదిత్యనాథ్‌ని కోరుతున్నాను వారు షాక్‌లో ఉన్నారు, నేను వారి పరిస్థితిని అర్థం చేసుకోవాలనుకున్నాను…” అని రాహుల్ గాంధీ సమావేశం అనంతరం తెలిపారు.
తొక్కిసలాట మృతుల కుటుంబాలను పరామర్శించిన రాహుల్ గాంధీ
- Advertisement -
- Advertisement -