రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకుసాగుదాం: మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర *🌹.
Rajyadhikar is the goal of moving forward: Telangana State Honorary President of Munnuru Kapu Sangam, Member of Rajya Sabha Vaviraju Ravichandra
*ట్రస్ట్ ఆఫ్ పటేల్స్ (టాప్) ఇనాగరేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వద్దిరాజు రవిచంద్ర …*🌹
—————————————-
రాజ్యాధికారమే లక్ష్యంగా, ధ్యేయంగా ముందుకు సాగుదామని మున్నూరుకాపులు,బీసీలకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్,మున్నూరుకాపు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు.బీసీలు అన్ని రంగాలలో బాగా వెనుకబడి పోయారని,గత ప్రభుత్వంతో పోల్చితే ఈసారి అసెంబ్లీలో ప్రాతినిథ్యం తగ్గిందని ఆవేదన వ్యక్తంచేశారు.”ట్రస్ట్ ఆఫ్ పటేల్స్ (టాప్)”ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎంపీ రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్ శివార్లలోని నాగారం ల్యాండ్ మార్క్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో, తర్వాత తెలంగాణలో మున్నూరుకాపు మంత్రి లేని సందర్భాన్ని మనమిప్పుడు చూస్తున్నామన్నారు.త్వరలో జరుగుతుందని భావిస్తున్న మంత్రివర్గ విస్తరణలో మున్నూరుకాపుకు ఇతర బీసీలకు స్థానం లభించాలని కోరుకుంటున్నానన్నారు.ట్రస్ట్ ఆఫ్ పటేల్స్ ఆవిర్భావం శుభ పరిణామమని,దీన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నానన్నారు.ఈ ట్రస్ట్, దీనికి ముందు ప్రారంభించబడిన పటేల్స్ ఎంటర్ ప్రెన్యూర్స్ నెట్ వర్క్,మున్నూరుకాపు సంఘం మరింత సమన్వయంతో ముందుకు సాగుతూ బలోపేతం కావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.ఈ టాప్ దేశవిదేశాలలో వివిధ రంగాలలో ఉన్నతంగా ఎదిగిన మన వారి నుంచి నిధులు సేకరించి సామాజిక సేవా కార్యక్రమాలు విస్త్రతంగా చేపట్టాలని ఎంపీ వద్దిరాజు సలహానిచ్చారు.మనం విద్యా ,ఉద్యోగ రంగాలలో రాణించగలిగినా, వాణిజ్య, వ్యాపార, పారిశ్రామిక, రాజకీయ రంగాలలో వెనుకబడి పోయామని ఎంపీ రవిచంద్ర ఆవేదన వ్యక్తంచేశారు.ఆ యా రంగాలలో మనం అభివృద్ధి చెందేందుకు ఆత్మస్థైర్యం,ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలని హితవు పలికారు.మహిళల రిజర్వేషన్స్ బిల్లు అమలు కావాలంటే కులగణన తప్పక చేయాల్సిందేనని,వచ్చే ఎన్నికలలో వారి ప్రాతినిథ్యం పెరగడం తథ్యమన్నారు.తన ఎంపీ నిధుల నుంచి జగిత్యాల జిల్లాకు చెందిన మిచ్చమ్మ చారిటీస్,ఈ ట్రస్ట్ ఆఫ్ పటేల్స్ కు ఒక్కొకటి చొప్పున రెండు అంబులెన్స్ వాహనాలను త్వరలో అందజేస్తానని ఎంపీ వద్దిరాజు హామీనిచ్చారు.అలాగే,భక్తుల కోసం వేములవాడ బస్టాండ్ నుంచి ఆలయం వరకు బస్సు సౌకర్యం కల్పిస్తానని చెప్పారు.ఈ సమావేశానికి మున్నూరుకాపు సంఘం అపెక్స్ కౌన్సిల్ కోర్ కమిటీ సభ్యులు రౌతు కనకయ్య అధ్యక్షత వహించగా వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.సమావేశంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న,జల వనరుల అభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ వీ.ప్రకాష్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యులు సీ.విఠల్, మున్నూరు కాపు ప్రముఖులు డాక్టర్ జే.ఎన్.వెంకట్,మరికల్ పోత సుధీర్ కుమార్,సత్తు మల్లేష్,ఎర్రా నాగేందర్,మీసాల చంద్రయ్య,ఊసా రఘు, లవంగాల అనిల్,పడాల భిక్షపతి,తెల్లా శ్రీధర్,తాడెం రమేష్, తోట వెంకటప్రసాద్,తెల్లా మురళీధర్,నేతి మంగమ్మ, బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి,గాలి శ్రీనివాస్ తదితరులకు జ్ఞాపికలు ప్రదానం చేసి గౌరవించారు.





