- Advertisement -
ముగ్గుల పోటీలు మేధాశక్తి దోహదపడతాయి
Rangoli competitions contribute to intelligence
ముగ్గులు వేయడం ఆరోగ్యానికి మేలు.
గోదావరిఖని
ముగ్గుల పోటీలు మేదశక్తి దోహదపడతాయని, ముగ్గులు వేయడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని.వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ లయన్ డాక్టర్,సురభి శ్రీధర్ అన్నారు. గోదావరిఖని మార్కండేయ కాలనీలోని, శ్రీ లిటిల్ జూనియర్స్ ప్లే స్కూల్ ఆధ్వర్యంలో, ప్లే స్కూల్ పిల్లల తల్లిదండ్రులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి. వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ లయన్ డాక్టర్.సురభి శ్రీధర్, అంజనిపుత్ర ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ గుర్రాల సురేష్, పాఠశాల కరస్పాండెంట్ రేణిగుంట తిరుపతి, హాజరై మాట్లాడారు.రంగోలి’ అనేది సంస్కృత పదం ‘రంగవల్లి’ నుంచి వచ్చింది. ‘రంగ్’ అంటే ‘రంగు’, ‘అవల్లి’ అంటే ‘వరుసలు, గీతలు’ అని అర్థం. ఇంటి ముందు ముగ్గు పెడితే మంచి జరుగుతుందని, ఇంట్లోకి అతిథులకు ఆహ్వానించడానికి గుర్తు అని చెప్తుంటారు. ముఖ్యంగా సిరిసంపదలనిచ్చే లక్ష్మీ దేవిని ఇంట్లోకి ఆహ్వానించినట్లు భావిస్తారు అని తెలిపారు.ముగ్గులు వేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ముగ్గులు మహిళలోని మేధాశక్తికి ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ నిర్మల దేవి, ప్లే స్కూల్ అధ్యాపకులు సుస్మిత, స్వప్న ,వాణిశ్రీ, సుమలత, మాధవి, అనుష తో పాటు శిరీష, రంజిత్ కుమార్ యాదవ్, వెంకటేష్, కిషోర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -