Monday, March 9, 2026

రష్మిక  నెల  సంపాదన…?

- Advertisement -
rashmika-monthly-earnings
rashmika-monthly-earnings

దక్షిణాది సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన హీరోయిన్లలో రష్మిక మందన్నా ఒకరు. అంతేకాదు ఇండస్ట్రీలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరు కూడా. చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలో అందరినీ ఆకట్టుకుంది. కన్నడ, తెలుగు చిత్రాలలో కెరీర్‌ రాణించిన రష్మిక కొద్దికాలంలోనే తమిళం, బాలీవుడ్‌లో భారీ విజయాన్ని సాధించింది. ‘నేషనల్ క్రష్’ గా పిలుచుకునే రష్మిక… ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ఇటు తెలుగులో పుష్ప 2 చిత్రంలో నటిస్తోంది. అలాగే త్వరలోనే యానిమల్ సినిమాతో అలరించనుంది. అయితే బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న రష్మికకు ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంది. ఈ బ్యూటీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 39.1 మిలియన్లకు పైగా ఫాలోవర్లు కలిగి ఉంది. ఇక రష్మిక ఒక్కో సినిమాకు భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.  దాదాపు రూ.4 కోట్లు భారీ మొత్తాన్ని వసూలు చేస్తుంది.  అలాగే అనేక బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు యాడ్స్ చేస్తుంది. రష్మిక మందన్న నికర విలువ $8 మిలియన్ USD అంటే రూ.45 కోట్లు. నివేదికల ప్రకారం, రూ.8 కోట్ల వార్షిక ఆదాయంతో నెలకు రూ.60 లక్షలు సంపాదిస్తుంది.

rashmika-monthly-earnings
rashmika-monthly-earnings
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్