28.7 C
New York
Sunday, June 23, 2024

బెంగళూరులో రేవ్ పార్టీ కలకలం.. పలువురు తెలుగు నటీమణులతో సహా 100 మంది అరెస్ట్

- Advertisement -

బెంగళూరులో రేవ్ పార్టీ కలకలం..
పలువురు తెలుగు నటీమణులతో సహా 100 మంది అరెస్ట్
ఆంధ్రాకు చెందిన ఓ ఎమ్మెల్యే పాస్ పోర్ట్ ను పోలీసులు స్వాధీనం
బెంగళూరు మే 20
బెంగళూరులో రేవ్ పార్టీ కలకలం రేపింది. ఆదివారం రాత్రి బెంగళూరు నగరంలోని ఎలక్ట్రానిక్ సిటి సమీపంలోని ఓ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరుతున్న సమయంలో పోలీసుల దాడి చేశారు. రేవ్ పార్టీలో ఎండీఎంఏ, కొకైన్ డ్రగ్స్ వాడుతున్నట్లు గుర్తించారు. ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న ఆంధ్రా, బెంగళూరుకు చెందిన 100 మందిని పోలీసులు అరెస్టు చేశారు.పట్టుబడిన వారిలో 25 మందికిపైగా యువతులు ఉన్నట్లు తెలుస్తోంది. బెంజ్ కారులో ఆంధ్రాకు చెందిన ఓ ఎమ్మెల్యే పాస్ పోర్ట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పార్టీలో పాల్గొని అరెస్టైన వారిలో పలువురు తెలుగు నటీమణులు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!