Sunday, September 8, 2024

సేవకునిగా పనిచేసే నాయకుడు రజాక్

- Advertisement -

సేవకునిగా పనిచేసే నాయకుడు రజాక్

ఐఎన్టియుసి బాధ్యతలు ఆయనకేనా

ప్రతిపక్ష కార్మిక సంఘాలకు ప్రత్యామ్నాయ గొంతుక రజాక్

కొత్తగూడెం
అధికారంలోకి రావడం కాదు అధికారాన్ని నిలబెట్టుకునేందుకు సేవకుడిగా పని చేయాలనేది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం అమలు చేస్తున్న నూతన సిద్ధాంతం. గతంలో జరిగిన తప్పిదాలను పునరావృతం కాకుండా నూతన నాయకత్వానికి శ్రీకారం చుడుతోంది కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ సంఘమైన ఐఎన్టియుసి కార్మిక సంఘం. గతంలో జరిగిన తప్పిదాలను సరిచేస్తూ పార్టీ అనుబంధ ఐఎన్టియుసి సంఘం ఇటీవల జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో తన మార్కును చూపిస్తూ సింగరేణి కార్పొరేట్ ఏరియాలో విజయ దుందుభిని మోగించింది. గెలుపును సొంతం చేసుకున్న ఐఎన్టియుసీ ముందున్న సవాల్ ఏంటంటే కార్మిక వర్గాన్ని కంటికి రెప్పలా కాపాడుకునే నాయకుడు ఇప్పుడు ఆ సంఘానికి తక్షణ అవసరంగా మారింది. ఇలాంటి తరుణంలో సింగరేణి వ్యాప్తంగా మరీ ముఖ్యంగా కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలో వినిపిస్తున్న ఒకే ఒక్క నాయకుడు పేరు రజాక్.
ఇలాంటి తరుణంలో కార్మిక వర్గ పక్షపాతిగా ప్రతిపక్ష కార్మిక సంఘాలకు దీటుగా స్పందించే నాయకుడిగా ఉమ్మడి కార్యచరణ ప్రకటించాల్సి వచ్చినప్పుడు ఐఎన్టీయూసీ సంఘ గొంతుకగా నిలిచే నాయకుడు ఒక్క రజక్ మాత్రమేనని చర్చ జరుగుతోంది. కార్మిక వర్గం ఐఎన్టీయూసీని విశ్వసించి ఆ కార్మిక సంఘానికి సముచిత స్థానాన్ని గుర్తింపు సంఘం ఎన్నికల్లో కల్పించింది దాన్ని నిజం చేసే విధంగా కార్మికులను ముందుండి నడిపించే నాయకుడిగా రజాక్ ను ఎన్నుకోవడం ద్వారా కార్మికులకు ఐఎన్టీయూసీ సంఘం మరింత దగ్గరవుతుందటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పదేళ్లు అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీ కార్మిక ప్రాంతాల్లో గుర్తింపు సంఘంగా ఐఎన్టియుసి అనుబంధ కార్మిక సంఘం ఒక్కసారిగా రేస్ లోకి రావడం శుభపరిణామని చెప్పుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి సంస్థ ఒక బలమైన కార్మిక విభాగాన్ని కలిగి ఉంది. గతంలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధం టీజీబీకేఎస్ గెలుపొందింది.
అయితే ఇటీవల జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో సింగరేణి కార్పొరేట్ సింగరేణి ఏరియాలో ఐఎన్టియుసి విజయ్ దుందుభి మోగించింది ఉద్యమ నాయకుడిగా కార్మికుల పక్షపాతిగా పేరుగాంచిన రజాక్ అనూహ్యంగా టీజీపీకేఎస్ నుంచి ఐఎన్టీయూసీ లోకి చేరడం కార్మిక వర్గాల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపిందనడంలో ఎలాంటి సందేహం లేదు. మృదు స్వభావిగా వివాదాలకు అతీతంగా ఉండే వ్యక్తిగా సింగరేణి కార్పొరేట్ ఏరియాలో రజాక్ కు మంచి పేరు ఉంది. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని సింగరేణి సంస్థలో తన ప్రస్థానాన్ని ప్రశ్నార్ధకం చేసుకున్న ఐఎన్టియుసికి రజాక్ రూపంలో ముందుండి నడిపించే నాయకుడు దొరికాడనే చెప్పుకోవాలి. బలమైన ఓటు బ్యాంకు కలిగిన కాంగ్రెస్ పార్టీలో దాని అనుబంధ కార్మిక సంఘమైన ఐఎన్టీయూసీ 10 సంవత్సరాలు దిక్కుతోచని పరిస్థితిలో సతమతమైందని కార్మికుల మనోభావనగా ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటుందో ఆ పార్టీ అనుబంధ సంఘం గుర్తింపు సంఘంగా కొనసాగడం ఆనవాయితీగా వస్తోంది. అయితే టీజీబీకేఎస్ నాయకుడిగా కార్మిక వర్గాలలో ప్రతిపక్ష కార్మిక సంఘాలతో తనదైన ముద్ర వేసుకున్న రజాక్ కు ఐఎన్టీయూసీ కి ఏరియా బాధ్యతలు చేపడుతున్నట్లు, ఈ విషయంలో పార్టీ అధినాయకత్వం కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి దానికి అనుబంధమైన కార్మిక సంఘంగా ఐఎన్టీయూసీని ముందుండి నడిపించాల్సిన నాయకుడు కూడా తక్షణంగా అవసరం ఉంది.
ఈ క్రమంలో కార్మికుల సమస్యలు కార్మిక వాడల్లో ఉన్న ఇబ్బందులు తెలుసుకొని ఇటు కార్మికులకు అటు అధికారులకు వారధిగా వ్యవహరించే నాయకుడు ఇప్పుడు కావాల్సి ఉంది. కొంత లోతుగా వెళ్లి పరిశీలిస్తే కొత్తగూడెం ఎమ్మెల్యే, జెడ్పి చైర్మన్, మున్సిపల్ చైర్ పర్సన్ ఇలా చాలామంది వరకు ఆంధ్ర ప్రాంత మూలాలు ఉన్న నాయకులే కొత్తగూడెంలో ప్రముఖ పాత్ర పోషించడం కొంత శోచనీయం. తొలి దశ మలిదశ ఉద్యమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెరిపి వేయలేని స్థానం ఉంది. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఐఎన్టియుసి నాయకత్వం తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు కార్మిక నాయకుడు రజాక్ కు ఐఎన్టీయూసీ బాధ్యతలను అప్పగించి ఆయనకు సముచిత స్థానం ఇస్తే బాగుంటుందని కార్మిక వర్గాల నుంచి బలమైన డిమాండ్ ఉంది. ఆ రకంగా చేయడం ద్వారా ఉద్యమ సమయంలో ఆ తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొంత అణచివేతకు గురయ్యామని భావిస్తున్న ఉద్యమకారులకు చోటు కల్పించిన ఖ్యాతి కాంగ్రెస్ పార్టీకి ఐఎన్టీయూసీ నాయకత్వానికి దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మలిదశ ఉద్యమంలో సింగరేణి వ్యాప్తంగా ఐఎన్టీయూసీ నాయకత్వం కూడా కార్మికులను మమేకం చేసుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొంది. అయితే తెలంగాణ రాష్ట్రం సాకారమయ్యాక ఆ క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకునే నాయకులు లేకపోవడంతో ఆ విషయం కార్మికుల కార్మికులకు చేరడంలో కొంత వైఫల్యం చెందిన మాట వాస్తవం. ఈ కారణంగానే గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐఎన్టియుసి గెలుపులో కీలక పాత్ర పోషించిన రజాక్ కు సరైన స్థానం కల్పించి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కార్మికుల కుటుంబ ఓట్లను కాంగ్రెస్ పార్టీకి వేయించుకునేలా చూడాలన్నది సింగరేణి ప్రాంత వాసుల అభిమతం. సింగరేణి ఏరియా వ్యాప్తంగా ఉన్న కార్మికులతో రజాక్ కు అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయనకు గుర్తింపు సంఘం ఐఎన్టియుసిలో సముచిత స్థానాన్ని ఇవ్వాలనే కార్మికుల డిమాండ్ ను కాంగ్రెస్ అధిష్టానం గౌరవిస్తుందనే అభిప్రాయాన్ని కొందరు నాయకులు వ్యక్తం చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్